11-11-2025 NORMAL NEWS 11:20 AM
swarnodayam.com
Telugu Daily News
11-11-2025 11:20 AM By Mandala Yadagiri

తెలంగాణ ఉద్యమకారుడు అపరాజ భిక్షపతి మృతి

తెలంగాణ ఉద్యమకారుడు అపరాజ భిక్షపతి మృతి
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:


తొలి దశ(1969), మలి దశల తెలంగాణ ఉద్యమకారుడు, హుజురాబాద్ పట్టణంలోని కిందివాడకు చెందిన అపరాజ భిక్షపతి(80) సోమవారం ఉదయం మృతి చెందారు.
తొలి దశ (1968) తెలంగాణ ఉద్యమం సందర్భంగా అప్పటి తెలంగాణ ప్రజాసమితికి అనుబధంగా పనిచేసిన తెలంగాణ విద్యార్థి సమితికి హుజూరాబాద్ తాలూకా కమిటీ అధ్యక్షులుగా నల్ల సుధాకర్ రెడ్డి(కొత్తగట్టు), ప్రధాన కార్యదర్ధిగా ఆవునూరి సమ్మయ్యలు ఉండి ఆ ఉద్యమంలో కీలకంగా పనిచేసారు.
ఆ ఉద్యమ సందర్బంగా యువకులుగా ఉన్న ఎదులాపురం లింగయ్య, అపరాజ భిక్షపతి, కేసరి బాపురావు, కాట్రపల్లి సుగుణాకర్ (అయ్యగారు), పంజాల సత్యనారాయణ, శ్రీపతి ఐలోని, తమ్మల గోపన్న లాంటి వాళ్ళు ఆనాటి విద్యార్థి ఉద్యమానికి అండగా నిలిచినవాళ్ళలో వున్నారు.
1969లో తెలంగాణ ఉద్యమం హుజూరాబాద్ ప్రాంతంలో తీవ్రంగా కొనసాగుతున్న సందర్భంలో ఇక్కడ సి.ఆర్.పి.ఎఫ్.పోలీస్ క్యాంపును ఏర్పాటు చేశారు.
ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నారన్న కారణంగా తొలిదశ ఉద్యమంలో హుజూరాబాద్ ప్రాంతం నుండి మొట్టమొదటి సారి అరెస్ట్ అయిన వారిలో యువనాయకులు అపరాజ భిక్షపతి, కేసరి బాపురావు,విద్యార్థి నాయకులు నల్ల సుధాకర్ రెడ్డి,ఆవునూరి సమ్మయ్య,మహమ్మద్ అబ్దుల్ కరీం లు వున్నారు.
వీరిని 14 రోజుల పాటు కరీంనగర్ జిల్లా జైల్లో నిర్బంధించిన తర్వాత జగిత్యాల సబ్ కోర్ట్ నుండి బెయిల్ పై విడుదలయ్యారు.
ఆ ఉద్యమంలో ఆవునూరి సమ్మయ్య, భిక్షపతి, కరీం, సుధాకర్ రెడ్డి, నలుబాల వెంకటస్వామి, తాళ్లపల్లి లక్ష్మయ్య, సయ్యద్ ఇంత్యాజుద్దీన్ లు చాలా చురుకుగా ఉండేవాళ్ళు.
మలిదశ ఉద్యమంలో కూడా భిక్షపతి అంబేద్కర్ కూడలి వద్ద కొనసాగిన దీక్షాశిబిరం వద్ద తన మిత్ర బృందంతో కోలాటం వేశారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత సమ్మయ్య చైర్మన్ గా ఉన్న జె.ఏ.సి.ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ సభలో తొలిదశ తొద్యమకారులు అపరాజ భిక్షపతి, ఎదులాపురం లింగయ్య, మహమ్మద్ అబ్దుల్ కరీం, నల్ల సుధాకర్ రెడ్డి లాంటి వారిని సత్కరించూకోవడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి, మలిదశ ఉద్యమాల్లో కీలకంగా పనిచేసిన నిరుపేద ఉద్యమకారులను తెలంగాణ ప్రభుత్వాలు ఆదుకుంటాయని భావించారూ,
ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించకపోవడం శోచనీయం.
తొలిదశ ఉద్యమకారుడు అపరాజ భిక్షపతి పేదరికాన్ని అనుభవంచి, ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారాన్ని అందుకోకుండానే ఆనంత లోకాలకు వెళ్లిపోయారు.
ఆయన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
తొలిదశ తెలంగాణ ఉద్యమ కారుడు అపరాజ భిక్షపతికి నివాళులు…ఆయన కుటుంబ సభ్యులందరికి పలువురు ఉద్యమకారులు మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఈ ఫోటోలో రౌండప్ చేసిన వ్యక్తి అపరాజ బిక్షపతి (ఫైల్ ఫోటో)

అపరాజ బిక్షపతి మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మాజీ ప్రజా పతినిధులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!