11-11-2025 NORMAL NEWS 06:31 PM
swarnodayam.com
Telugu Daily News
11-11-2025 06:31 PM By Mandala Yadagiri

ప్రతి ఒక్క ఆదివాసి బిడ్డ ప్రశ్నించే గొంతుగలా చైతన్యం కావాలి.. – తెలంగాణ ఆదివాసి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు ఆధ్వర్యంలో పలువురు చేరిక

ప్రతి ఒక్క ఆదివాసి బిడ్డ ప్రశ్నించే గొంతుగలా చైతన్యం కావాలి.. – తెలంగాణ ఆదివాసి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు ఆధ్వర్యంలో పలువురు చేరిక
IMG-20251111-WA0028

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రతి ఒక్క ఆదివాసి బిడ్డ ప్రశ్నించే గొంతుగలా చైతన్యవంతులు కావాలనీ తెలంగాణ ఆదివాసి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు పిలుపునిచ్చారు. తెలంగాణ ఆదివాసి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు ఆధ్వర్యంలో ఆదివాసి తోటి సంఘానికి రాష్ట్ర కోశాధికారిగా ఎంపికైన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని గణేష్ నగర్ కు చెందిన చెడుమాకి బిక్షపతిని శాలువాతో సత్కరించి తెలంగాణ జాగృతిలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు మాట్లాడుతూ రాజ్యాంగ పరంగా రావలసిన ఆదివాసి హక్కుల కోసం ప్రతి ఒక్క ఆదివాసి బిడ్డ ప్రశ్నించే గొంతుగలా చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. అందులో ప్రథమంగా తెలంగాణ ఆదివాసి జాగృతి నిర్మాణ దశలో ఉన్నందున ఆదివాసీ నాయకులు విచ్చేసి ఆదివాసి ఉద్యమ పంతాను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.
అందుకు ఆదివాసి జాగృతి తమ వెంట నిలుస్తుందని ఈ సందర్భంగా అన్నారు.

ఆదివాసి తోటి తెగ విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాలలో ఆదివాసి తోటి జాతితో పాటు అన్ని ఆదివాసి తెగలు అంచలంచలుగా ఎదగాలని, ప్రతి ఉద్యమంలో జాతి సమస్యలు పరిష్కరించడంలో ముందుండి, ఆదివాసి ఆకలి అరుపులను భావి తరాలకు మరియు సమాజానికి తెలియ చెప్పడంలో, పరిష్కరించే దిశగా ప్రతిఘటిస్తున్న ఉద్యమ నాయకుల వెన్నంటి నడివాలని మరియు తమ సమస్యలను పరిష్కరించుకునే దిశలో పోరాటాలు ఉండాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి జాగృతి జగిత్యాల జిల్లా అధ్యక్షు కురుసంగి వేణు, ఆదివాసి జాగృతి పెద్దపెళ్లి జిల్లా అధ్యక్షులు ఆత్రం పురుషోత్తం, నిజమాబాద్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు మడావి మంజుల, ఆదివాసి జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కూతాడి శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా జాగృతి నాయకులు కుతాడి కుమార్, తోటి యువజన సంఘం కరీంనగర్ జిల్లా కో కన్వీనర్ శడుమాకి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసి తోటి సంఘానికి రాష్ట్ర కోశాధికారిగా ఎంపికైన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని గణేష్ నగర్ కు చెందిన చెడుమాకి బిక్షపతిని శాలువాతో సత్కరించి తెలంగాణ జాగృతిలోకి ఆహ్వానిస్తున్న తెలంగాణ ఆదివాసి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు, ఇతర నాయకులు..

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!