13-11-2025 NORMAL NEWS 07:04 PM
swarnodayam.com
Telugu Daily News
13-11-2025 07:04 PM By Mandala Yadagiri

గ్రహోపకర వంట గ్యాస్ వినియోగదారుల కోసం బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణికణ EKYC కార్యక్రమంలో పాల్గొనండి. -తెలంగాణ వంట గ్యాస్ డీలర్ల అధికార ప్రతినిధి పి.వి.మదన్ మోహన్ రావు

గ్రహోపకర వంట గ్యాస్ వినియోగదారుల కోసం బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణికణ EKYC కార్యక్రమంలో పాల్గొనండి. -తెలంగాణ వంట గ్యాస్ డీలర్ల అధికార ప్రతినిధి పి.వి.మదన్ మోహన్ రావు
IMG_20251113_190217

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రధానమంత్రి ఉజ్వల యోజన PMUY వినియోగదారులతో సహా ప్రభుత్వ రంగ సంస్థలు అందించే IOCL/BPCL/HPCL వంటగ్యాస్ వాడకం దారులు బయోమెట్రిక్ ఆధార్ ప్రమాణీకరణ EKYCఎలక్ట్రానిక్ ఈకేవైసి చేసుకోవాలని‌ తెలంగాణ వంట గ్యాస్ డీలర్ల అధికార ప్రతినిధి పి.వి.మదన్ మోహన్ రావు కోరారు.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆయిల్ కంపనీలు విస్త్రుతంగా ప్రచారం కోసం ప్రకటన విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.
*స్వయంగా బయోమెట్రిక్ ప్రామాణికరణ EKYC చేసుకునే వారు ఆయిల్ కంపనీ(IOCL/BPCL/HPCL) మొబైల్ ఆప్ ద్వారా EKYC చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
OMCమరియUIDAI యొక్క ఆధార్ ముఖ గుర్తింపు ఆప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఇచ్చిన క్యూఆర్ కోడ్ పొందుపరిచారని దానిని స్కాన్ చేసుకోవచ్చని లేదా https:www.pmuy.gov.in/e-kyc.html సందర్శించి సదుపాయం పొందవచ్చన్నారు. గ్యాస్ కనెక్షన్లు పొంది‌న ఏజన్సీలో కాని యల్పీజి డెలివరీ బాయ్ ద్వారా EKYC చేసుకోవడాని అవకాశం వుందని ఆయన తెలిపారు.
*ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజ‌న PMUY లబ్ధిదారులు EKYC ప్రతి సంవత్సరం తప్పనిసరిగా చేసుకోవాలి అన్నారు.
గతంలో బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణికరణను EKYC పూర్తిచేసిన వారితో సహా 14.2 కిలోల సిలిండర్ల 8 మరియు9వ రీఫిల్ పైన (₹300) అదేవిధంగా 5kg గ్యాస్ సిలిండరుకు 21వ రీఫిల్ పైన అనులోమానుపాతంలో గ్యాస్ రాయితీలు పొందేవారికి ఈ నియమం వర్తిస్తుందని కూడా తెలిపారు‌.
*టార్గెటెడ్ డిబిటి DBTL సబ్సిడీ ఒక ఆర్థిక సంవత్సరంలో 9 (తొమ్మిది)14.2kg రీఫిల్స్ వరకు మాత్రమే వర్తిస్తుంది. దీనకి గాను రూ.300 లేదా 5kg సిలిండరుకు (అనులోమానుపాతంలో )
*8మరియు 9వ రీఫిల్ పైన నిలిపివేయబడిన డిబిటి
(direct benefit transfer lpg) పొందుటకు ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 లోపు బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణ EKYC చేసుకోవాలన్నారు. ఒకవేళ మార్చి 31లోపు EKYC పూర్తికాకపోతే ఆ సంవత్సరంలో తీసుకున్న రీఫిల్లకు నిలిపివేయబడిన సబ్సిడీ శాశ్వతంగా రద్దవుతుందని ఆయన పేర్కొన్నారు.
*బయోమెట్రిక్ ప్రామాణీకరణ EKYC లేనప్పుడు గ్యాస్ రీఫిల్ సరఫరాలో ఎటువంటి అంతరాయం వుండదని‌ లబ్ధిదారులు నిర్ణీత వార్షిక పరిమితి వరకు రీఫిల్ కొరకు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా 14.2 కిలోల సిలిండర్ యొక్క ₹300 టార్గెటెడ్ సబ్సిడీ 9 రీఫిల్స్ వరకు మరియు 5kg సిలిండరుకు అనులోమానుపాతంలో వర్తిస్తుందని కూడా తెలిపారు.
ఇప్పటికే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక సారి బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణికరణ EKYC పూర్తిచేసిన PMUY లబ్ధిదారులు మళ్లీ దానిని పునరావృతం చేయనవసరం లేదని వివరించారు.
ఈకేవైసి విషయంలో సంబంధిత యల్పీజి డీలర్,డెలివరి సిబ్బంది కస్టమర్లను సంప్రదిస్తారని మదన్ మోహన్ పేర్కొన్నారు.
మరిన్ని వివరాల కోసం ఆయిల్ ఇండస్ట్రీ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 18002333555 సంప్రదచాలని మదన్ మోహన్ సూచించారు.

కాలం చెల్లిన /నాణ్యత ప్రమాణాలు లేని రబ్బరు ట్యూబుల వాడకండి
గ్యాస్ వాడకం దారులు నాణ్యత ప్రమాణాలు ‌లేని రబ్బరు ట్యూబులు వాడడం వల్ల తరుచూ జరిగే గ్యాస్ ప్రమాదాల నివారణకు ప్రభత్వ ఆయిల్ కంపనీలు ఆమోదించింది సురక్ష రబ్బరు ట్యూబులు వాడాలని సూచించారు. సురక్ష రబ్బరు ట్యూబు కాలపరిమితి ఐదు సంవత్సరాలు దానిపై తయారీ తేది కాలపరిమితి ‌ముగిసే తేది ముద్రించబడి వుంటాయి..అగ్ని ప్రమాదం వలన చెలరేగిన మంటలకు సురక్ష పైపు కాలదని ఆయన తెలిపారు.
ఐదు సంవత్సరాల క్రితం సురక్ష పైపు తీసుకున్న వారు కొత్త సురక్ష రబ్బరు ట్యూబు ఆయిల్ కంపనీల డీలర్ల వద్ద పొందలన్నారు…ISI నాణ్యత ప్రమాణాలు లేని రబ్బరు ట్యూబులు వాడితే ప్రమాద బీమాకు వర్తించే అవకాశాలు వుండవని పి.వి‌.మదన్ మోహన్ తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!