Social 1080×1350 • Multi-page
14-11-2025 BREAKING NEWS 06:50 PM
swarnodayam.com
Telugu Daily News

చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి.. – సీనియర్ సివిల్ జడ్జ్ పిబి కిరణ్ కుమార్

చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి.. – సీనియర్ సివిల్ జడ్జ్ పిబి కిరణ్ కుమార్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని హుజురాబాద్ సీనియర్ సివిల్ జడ్జ్ పిబి కిరణ్ కుమార్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని సూపర్ బజార్ రోడ్ లో గల కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఇవి ఉపయోగపడతాయి అన్నారు. అనంతరం ప్రతిభ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విన్సెంట్ జార్జ్, డైరెక్టర్లు గౌతమ్ రెడ్డి, సంపత్ ఉపాధ్యాయులు రాజు, సంపత్ పీటర్, వాణిశ్రీ, సరిత ,రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న హుజురాబాద్ సీనియర్ సివిల్ జడ్జ్ పిబి కిరణ్ కుమార్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!