Social 1080×1350 • Multi-page
14-11-2025 BREAKING NEWS 07:14 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

హుజురాబాద్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
IMG_20251114_191054

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
భారత తొలి ప్రధాని స్వర్గీయ పండిత జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని పలు విద్యాసంస్థల్లో బాలల దినోత్సవ వేడుకలు పిల్లలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో బాలల దినోత్సవం పురస్కరించుకొని స్వయం పరిపాలన దినోత్సవంను నిర్వహించారు. పిల్లలే ఉపాధ్యాయులుగా మారి ఒక్కరోజు ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించారు. పలు పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర గురించి, పిల్లలంటే ఆయనకు గల ప్రేమ గురించి పిల్లలకు ఉపాధ్యాయులు వివరించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించిన పిల్లలకు బహుమతులు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్తమ ప్రదర్శన చేసిన వారికి సైతం బహుమతులు అందజేశారు.

విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి బోధిస్తున్న దృశ్యాలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!