Social 1080×1350 • Multi-page
14-11-2025 BREAKING NEWS 07:29 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో షుగర్ వ్యాధిపై ర్యాలీ

హుజురాబాద్ లో షుగర్ వ్యాధిపై ర్యాలీ
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో శుక్రవారం ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ డిప్యూటీ డిఎమ్ అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నల్ల నారాయణరెడ్డిలు మాట్లాడుతూ… షుగర్ వ్యాధి ప్రతి ముగ్గురిలో ఇద్దరికీ సోకుతుందని ఆహారపు అలవాట్లు సక్రమంగా లేకపోవడం వల్ల ఇది సంక్రమిస్తుందని అన్నారు. షుగర్ వ్యాధి సోకిన వారు మితా ఆహారం తీసుకోవాలని, శారీరక వ్యాయామం అవసరమని అన్నారు. వైద్యుల సలహా, సూచనలను తప్పనిసరిగా పాటించి వ్యాధిని అదుపులో పెట్టుకోవాలన్నారు. షుగర్ వ్యాధి అదుపులో పెట్టుకోకుంటే కిడ్నీ కంటిచూపు ఇతర ఇబ్బందులు వస్తాయని అన్నారు. ప్రభుత్వం ఉచితంగా మందులు ఇస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య, డాక్టర్ జరీనా తదితరులు పాల్గొన్నారు.

ఆస్పత్రి నుండి ర్యాలీ నిర్వహిస్తున్న హుజురాబాద్ డిప్యూటీ డిఎమ్ అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నల్ల నారాయణరెడ్డి వైద్య సిబ్బంది..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!