Social 1080×1350 • Multi-page
16-11-2025 BREAKING NEWS 11:02 PM
swarnodayam.com
Telugu Daily News

సీనియర్ జర్నలిస్టు మృతి పట్ల పలువురి సంతాపం

సీనియర్ జర్నలిస్టు మృతి పట్ల పలువురి సంతాపం
IMG_20251116_225810

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట), నవంబర్ 16: జమ్మికుంట పట్టణంలో గత 28 ఏండ్లుగా జర్నలిస్టు వృత్తిలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని ప్రజలతో మమేకమై ఎన్నో ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ జర్నలిస్టు ఓరుగంటి శ్రీనివాస్ రావు ఇటీవల వృత్తి చెందిన విషయం విధితమే. ఆయన మృతి విషయాన్ని తెలుసుకొని తోటి జర్నలిస్టులు దొగ్గల ప్రకాష్, మారపల్లి రాజేష్, బిట్ల కిషోర్ కుమార్ లు ఆదివారం వాళ్ల కుటుంబ సభ్యులను కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆత్మస్థైర్యంతో ఉండాలని ఆ భగవంతుడు మీకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పత్రిక రంగంలో సమాజ సేవ చేసేందుకు వృత్తిగా ఎంచుకున్న ఓరుగంటి శ్రీనివాస్ రావు ఎన్నో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల మనసులో మన్ననలు పొందాడని. ఆయన ప్రజా సమస్యల పరిష్కారంలో చూపిన తెగువ ఎందరికో ఆదర్శనీయమని అన్నారు. ఆయన మృతి పత్రిక రంగానికే తీరని లోటని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులపరంగా తాము ఆ కుటుంబానికి అండగా ఉంటామని మృతుడి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. పత్రిక రంగంలో ఉన్నప్పుడు ఎంతో మందికి చేయూతను అందించిన ఓరుగంటి శ్రీనివాస్ రావు మృతి తీరని లోటని ఆయన సేవలను గుర్తు చేసుకొని సంతాపం వ్యక్తం చేశారు.

Oplus_16908288

మృతుడి చిత్రపటం వద్దనివాళులర్పిస్తున్న నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!