17-11-2025 NORMAL NEWS 05:08 PM
swarnodayam.com
Telugu Daily News
17-11-2025 05:08 PM By Mandala Yadagiri

బీసీల హక్కులు బీసీలకే దక్కాలి…. – జమ్మికుంట సదస్సును విజయవంతం చేయండి.

బీసీల హక్కులు బీసీలకే దక్కాలి…. – జమ్మికుంట సదస్సును విజయవంతం చేయండి.
IMG-20251117-WA0057

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బిసీల రిజర్వేషన్ల కోసం ఈనెల 19న మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో జమ్మికుంట దినేష్ కన్వీన్షన్ లో నిర్వహించే బీసీ రిజర్వేషన్ల సదస్సుని విజయవంతం చేయాలని కోరుతూ మానవ హక్కుల వేదిక, వివిధ రాజకీయ పార్టీలు, దళిత, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో హుజురాబాద్ అంబేద్కర్ కూడలిలోసదస్సుకు సంబందించిన వాల్ పోస్టర్, కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తరతరాలుగా విద్యా, గౌరవం, సంపద, అధికారం సమీపాలకు రాకుండా బీసీ కులాలు అణచివేయబడ్డాయని, ఎన్నో ఏళ్లుగా వ్యవస్థీకృత పీడన పర్యవసానాలను అనుభవిస్తున్నాయని అన్నారు. రాజకీయ రంగం తో పాటు ఏ కీలక రంగంలోనూ బీసీలకు ఉండాల్సినంత వాటా లేదని ఇప్పుడు బీసీలు చైతన్యవంతమై గౌరవప్రదమైన జీవితం, స్థానాలను ఆకాంక్షిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన వాగ్దానం ప్రకారం కొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ, మిగతా రాజకీయ పార్టీలు వారి చిత్తశుద్ధి కనపర్చడం లేదని ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలో ఉన్న బీసీ నాయకత్వం పార్టీలకతీతంగా చైతన్యవంతమై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి, స్థానిక సంస్థల, చట్టసభల్లో తమ జనాభా దామాషాల్లో రిజర్వేషన్ల కొరకు కోర్టులు అడ్డురాని విధంగా రాజ్యాంగ సమ్మతంగా చట్టం చేయాలని, రాష్ట్రంలోనే కాకుండా, కేంద్ర సంస్థల్లోనూ, ప్రైవేట్ రంగంలో కూడా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని, అత్యవసరంగా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ప్రతి రాజకీయ పార్టీ బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు. జమ్మికుంట సదస్సుకు అన్ని రాజకీయ పార్టీల్లో వున్న బీసీ నాయకులు, దళిత, ప్రజా సంఘాల నాయకులు, ఉద్యకారులు, బీసీయేతర ప్రజాతంత్ర మేధావులు, బుద్దిజీవులు హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య, తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు, నాయకులు గుంటి సామ్రాజ్యం, బండి రమేష్, కొలిపాక సారయ్య, మార్త రవీందర్, పులి జగన్నాథం వేల్పుల ప్రభాకర్, సాదుల వెంకన్న, భీమోజు సదన్న, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288

జమ్మికుంట సదస్సు వాల్ పోస్టర్, కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న వివిధ రాజకీయ, బీసీ సంఘాల నాయకులు…

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!