Social 1080×1350 • Multi-page
17-11-2025 BREAKING NEWS 06:09 PM
swarnodayam.com
Telugu Daily News

రాజకీయ భీష్ముడు – కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు.. – జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు అర్జున్.

రాజకీయ భీష్ముడు – కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు.. – జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు అర్జున్.
IMG_20251117_180629

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రస్థానానికి కొత్త దిశను చూపించిన నిబద్ధత కలిగిన నాయకుడు, ప్రజాసేవలో నిస్వార్థంగా పనిచేసే మాజీ మంత్రి, మాజీ ఎంపీ కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు రాజకీయ భీష్ముడు లాంటివారని, ఆయనకు నేడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం గర్వంగా ఉందనీ హుజురాబాద్ పట్టణానికి చెందిన తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్ పేర్కొన్నారు. దేశ సేవలో ఇండియన్ ఆర్మీలో కీలక బాధ్యతలు నిర్వహించి, తరువాత రాజకీయ రంగంలోనూ అదే క్రమశిక్షణ, ధైర్యం, దూరదృష్టితో ముందుకు సాగిన నాయకుడు కెప్టెన్ అని అన్నారు.
ఆయన తెలంగాణ ఉద్యమ ప్రారంభ దశలనుంచి కీలక పాత్ర పోషించి, టిఆర్ఎస్ (బిఆర్ఎస్) పార్టీ బలోపేతానికి తన సేవల్ని అంకితం చేశారన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రజా సమస్యలను ధైర్యంగా మాట్లాడి, రాష్ట్రాభివృద్ధి పట్ల కట్టుబాటు చూపుతూ ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టారనీ అర్జున్ గుర్తు చేశారు. విద్యా అభివృద్ధి, సామాజిక సేవ, యువతను ప్రోత్సహించడం, ప్రతి రంగంలో ఆయన చూపిన దిశా నిర్దేశం ఆదర్శప్రాయమైనదన్నారు. అందుకే ఆయన్ని ప్రజలు ప్రేమతో “రాజకీయ బేష్ముడు” అని పిలుస్తున్నారనీ ఈ సందర్భంగా, తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ వీ అర్జున్ పేర్కొన్నారు. కెప్టెన్ వి లక్ష్మీకాంతరావును కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. కెప్టెన్ దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, మరెన్నో రాజకీయ విజయాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.

కెప్టెన్ కు శాలువా కప్పి పుష్పగుచ్చాలు ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న తెలంగాణ యూత్ ఫోర్సు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!