Social 1080×1350 • Multi-page
18-11-2025 BREAKING NEWS 07:25 PM
swarnodayam.com
Telugu Daily News

జమ్మికుంటలో42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి సదస్సును విజయవంతం చేయండి.- బీసీ జెఏసి రాష్ట కన్వీనర్ జక్కే వీరస్వామిగౌడ్

జమ్మికుంటలో42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి సదస్సును విజయవంతం చేయండి.- బీసీ జెఏసి రాష్ట కన్వీనర్ జక్కే వీరస్వామిగౌడ్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్(జమ్మికుంట): కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఇందిరానగర్ దినేష్ కన్వెన్షన్ హాల్ లో ఈ నెల 19వ తేది ఉదయం 10 గoటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సదస్సు నిర్వహిస్తున్నామని ఈ సదస్సుకు హుజురాబాద్ నియోజకవర్గంలోని బీసీలు పార్టీలకు అతీతంగా తరలి రావాలని బీసీ జేఏసీ రాష్ట కన్వీనర్ జక్కే వీరస్వామిగౌడ్ పిలుపునిచ్చారు.
ఈ రోజు మంగళవారం జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతు మానవ హక్కుల వేదిక రాష్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య అధ్యక్షతన జరిగే ఈ సదస్సుకు రిటైర్డ్ ఐఏఎస్ టి.చిరంజీవులు, కాకతీయ యూనివర్సిటీ ప్రొపెసర్ మురళి మనోహర్, ఎస్ జీవన్ కుమార్ హాజరై బీసీ రిజర్వేషన్ల పై దశ నిర్దేశం చేయనున్నారని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని బీసీ కుల సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, విద్యార్థిని విద్యార్థులు, మహిళలు బీసీ సమాజం పెద్ద సంఖ్యలో హాజరై సదస్సు విజయవంతం చేయాలని వీరస్వామిగౌడ్ కోరారు. తరతరాలుగా 78 ఏళ్లుగా బీసీలను విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో అగ్రవర్ణ పార్టీలు మోసం చేస్తూనే ఉన్నాయని ఈ మోసాలను గ్రామీణ ప్రాంతాల్లోని బీసీలకు తెలియాలనే ఉద్దేశంతోనే నియోజకవర్గ సదస్సు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బీసీ రిజర్వేషన్లు కోరుకునే వారందరు కూడా ఈ సదస్సుకు స్వచ్చందంగా కదలి వచ్చి వారి మద్దతు తెలియ జేయాలని చెప్పారు. ఇంకా ఎన్ని రోజులు అగ్రవర్ణ పార్టీల జెండాలు మోస్తారని ఇకనైనా సోయి తెచ్చుకొని మన ఓట్లు మనం వేసుకున్న రోజు రాజ్యాధికారం హస్తగతం అవుతుందని అన్నారు. మనం ఒకరిని రిజర్వేషన్ అడుక్కునే దిశ నుండి వారికి ఇచ్చే దిశగా సోయి తెచ్చుకొని అడుగులు వేయాలని, పార్టీలకు అతీతంగా బీసీలు ఒక్కటై రిజర్వేషన్లను అడ్డుకుంటున్న పార్టీల భరతం పట్టాలని వీరస్వామిగౌడ్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోడీని ఒప్పించి పార్లమెంటులో చట్టం చేసి 9వ షెడ్యూల్ లో చేర్పించిన తరువాతే స్థానిక ఎలక్షన్లు నిర్వహించాలని లేకుంటే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల డ్రామాలు బీసీలు, సమాజం గమనిస్తుందని రిజర్వేషన్లకు అడ్డు తగులుతున్న పార్టీలను బొంద పెట్టె రోజులు దగ్గరలోనే ఉన్నాయని పరోక్షంగా రాజకీయ పార్టీలను హెచ్చరించారు.

బీసీ జెఏసి రాష్ట కన్వీనర్ జక్కే వీరస్వామిగౌడ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!