Social 1080×1350 • Multi-page
18-11-2025 BREAKING NEWS 11:16 PM
swarnodayam.com
Telugu Daily News

దేశ సంపద కార్పొరేట్ల పాలు..

దేశ సంపద కార్పొరేట్ల పాలు..
Oplus_16908288

– ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న ప్రభుత్వ విధానాలు
– మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

ప్రజాస్వామ్య విధానాలకు తిలోదకాలిస్తూ దేశ సంపదను కార్పొరేట్లకు నేటి ప్రభుత్వాలు ధార దత్తం చేస్తున్నాయని సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సిపిఐ వందేళ్ల చరిత్ర సందర్భంగా నిర్వహిస్తున్న జాత మంగళవారం హుజూరాబాద్ పట్టణంకు చేరింది. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ…
సిపిఐ వందేళ్ల ప్రజా ఉద్యమాల చరిత్ర కలదని, అనేక మంది త్యాగ ధనులు, పోరాట యోధుల త్యాగాలను రాష్ట్ర వ్యాపితంగా ప్రజలకు తెలియజేస్తూ చేత నిర్వహిస్తున్నట్లు అన్నారు. ఈ నెల 15 న కొమురo భీమ్ జిల్లా జోడే గాట్ నుండి ప్రారంభమైందన్నారు. భూమి కోసం భుక్తి కోసం భారతదేశ విముక్తి కోసం మిలిటెంట్ ఉద్యమాలు నడిపినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో దేశంలో కమ్యూనిస్టు పార్టీలు మరింత బలపడాలని వామపక్ష ప్రజాతంత్ర పురోగామి శక్తులు ఏకం కావాలని కావాలని చెప్పి ఆయన అన్నారు

. బిజెపి పార్టీ 2014 ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రగడ్బాలు పలికిన బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేయలేదని అంతేకాకుండా దేశంలో బిజెపి పార్టీ ప్రజల మధ్య మత విశ్వాసాలు రెచ్చగొడుతూ వరుసగా అధికారం నిలబెట్టుకున్నారు అని చెప్పి ఆయన అన్నారు. దేశ సంపదను ఆదాని అంబానీ కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేస్తుందన్నారు. బిజెపి పాలనలో ప్రజాస్వామ్య హక్కులు హరించుకు పోతున్నాయని ఒకవైపు మావోయిస్టులు చర్చలకు వస్తామని చెప్పిన చంపివేయడం సరికాదన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలుపరచడంలో బిజెపి పూర్తిగా విఫలమైందని తనకు నచ్చిన విధంగా మెజారిటీ ఉందన్న కారణంగా పరిపాలన చేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా బిజెపి విధానాలను ఎండగట్టాలన్నారు.ఈ జాతాలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపెల్లి శ్రీనివాస రావు , సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కళావేనా శంకర్ , ఏ ఐ యస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి, DHPS రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్, ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నర్సింహా, ఓయూ నాయకులు రెహమాన్, కన్నం లక్ష్మి నారాయణ, హుజురాబాద్ మండల కార్యదర్శి ఇల్లందుల రవి జిల్లా కార్యదర్శి కా, పంజాల శ్రీనివాస్, పొనగంటి కేదారి, బత్తుల బాబు, కొయ్యడ సృజన్ కుమార్, గూడెం లక్ష్మి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్, గజ్జి ఐలయ్య, రత్నాకర్, గడిపే మల్లేష్, జాగిరి సత్యనారాయణ, నాయకులు రాము, కనుకం సాగర్, కార్మికులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న చాడ వెంకటరెడ్డి..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!