Social 1080×1350 • Multi-page
19-11-2025 BREAKING NEWS 02:53 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలు

ఘనంగా దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలు
IMG-20251119-WA0024

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మాజీ మహిళా ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ 108వ జయంతినీ హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు ఇందిరానగర్ కాలనీలో పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఇందిరానగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో పిల్లలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితెల ప్రణవ్ ఆదేశాల మేరకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు, బ్లాక్ అధ్యక్షురాలు ఆలేటి సుశీల, మండల అధ్యక్షురాలు పుల్ల రాధ, మైనార్టీ నాయకులు ఏండి అప్సర్, సీనియర్ నాయకులు రామ్ శంకర్ గౌడ్, నర్సింగ్, కిరణ్ రెడ్డి, సునీత, కరీమ, రియాజ్, మధుకర్ రిబ్క, విల్సన్, రఘుపతి, మిడిదొడ్డి రాజు, తిరుమల, రాధ, కల్పన తదితరులు పాల్గొన్నారు.

ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నేతలు..

పిల్లలకు పండ్లు స్వీట్లు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు పుష్పలత, రాధ తదితరులు..

Oplus_16908288

పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!