Social 1080×1350 • Multi-page
19-11-2025 BREAKING NEWS 07:36 PM
swarnodayam.com
Telugu Daily News

వన్నారం గ్రామపంచాయతి నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి.

వన్నారం గ్రామపంచాయతి నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి.
IMG_20251119_193225

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల వన్నారం గ్రామ పంచాయతి నూతన భవన నిర్మాణ పనులను స్ధానిక ఎంఎల్ ఏ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బుధవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. 20 లక్షల రూపాయల ఉపాధి హామీ నిధులతో చేపట్టిన ఇట్టి భవన నిర్మాణానికి గ్రామానికే చెందిన కీ.శే.రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ద్యావనపల్లి తిరుపతిరావు సతీమణి ద్యావనపల్లి సరోజినీదేవి ప్రధాన రహదారి సమీపంలో గ్రామ నడి సెంటర్ లో నాలుగు లక్షల రూపాయల విలువైన రెండు గంటల భూమి విరాళంగా ఇచ్చారు. ఇందుకు ధాత సరోజినీదేవిని ఎంఎల్ఏ కవ్వంపల్లి అభినందించారు. సీనియర్ సిటిజన్ పోలాడి రామారావు, స్పెషల్ ఆఫీసర్ వెంకన్న, పిఆర్ డిప్యూటీ ఈఈ రవి ప్రసాద్, తహసీల్దార్ విజయకుమార్, ఎంపిడిఓ వరలక్ష్మి, ఎంపీఓ సతీశ్ రావు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్రాచారి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రదాన కార్యదర్శి తాళ్ళపల్లి సంపత్ కుమార్ గౌడ్, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రథాన కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీకాంత్,
పంచాయతి సెక్రటరీలు ప్రసూన, ఆనంద్, కవిత, మాజీ సర్పంచులు బాకారపు శ్రీనివాస్, పెంచాల రాజయ్య, బాకారపు రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు, డైరెక్టర్ చలిగంటి ఓదెలు, సింగిల్ విండో డైరెక్టర్లు వాల అంజిత్ రావు, బకారపు రవి, మాజీ ఎంపీటీసీలు గంగుల రవి, ఆకుల నర్సింగారావు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారావు రమేష్, గ్రామ యాదవ సంఘం అధ్యక్షుడు బనుక తిరుపతి, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు తాల్లపల్లి కొమరయ్య, మాజీ ఉప సర్పంచ్ బాకారపు తిరుపతి, దుద్దెనపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కనకం కుమార్, బాకారపు సమ్మయ్య, పాండ్రాల కనక రాజేశం, ఆయా గ్రామాల నాయకులు, పంచాయతి ఉద్యోగులు పాల్గొనగా వన్నారం గ్రామానికి వచ్చిన కవ్వంపల్లికి గ్రామస్తులు శాలువాలు కప్పి పూల బోకేలు అందించి ఘన స్వాగతం పలికారు.
అంతకు ముందు ఉపాది హామీ నిధులతో చేపట్టి పూర్తయిన శెంశాబాద్ గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ఏంఎల్ ఏ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు.
గట్టుదుద్దెనపల్లి గ్రామ పంచాయతి నూతన భవన నిర్మాణానికి మంజూరైన ఈజీఎస్ 20లక్షల నిధుల పనికి ఎంఎల్ ఏ శంకుస్థాపన చేశారు. కాగా వన్నారం గ్రామ పంచాయతి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడుతూ గట్టుదుద్దెనపల్లి ఎంపీటీసీ పరిధిలోకి వచ్చే గట్టుదుద్దెనపల్లి, వన్నారం, శెంశాబాద్ 3 గ్రామాల నూతన గ్రామ పంచాయతి భవనాల నిర్మాణానికి ఒక్కొక్క గ్రామ పంచాయతికి 20లక్షల చొప్పున 60 లక్షల రూపాయల ఉపాధి హామీ నిధులను మంజూరు చేసి పనులు ప్రారంభించిన మానకొండూరు శాసన సభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సీనియర్ సిటిజన్ పోలాడి రామారావు సభా ముఖంగా ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల వన్నారం గ్రామ పంచాయతి నూతన భవన నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించిన మానకొండూరు నియోజక వర్గ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పక్కన పోలాడి రామారావు..

భూమి తవ్విపనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి, పోలాడి రామారావు..

సభాముఖంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్న పోలాడి రామారావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!