Social 1080×1350 • Multi-page
20-11-2025 BREAKING NEWS 06:27 PM
swarnodayam.com
Telugu Daily News

మావోయిస్టు నేత హిడ్మా ది బుటకపు ఎన్ కౌంటరే.. – మోడీ, అమిత్ షా దేశంలో హింసాత్మక పాలన చేస్తున్నారు.. – పోలీసుల పై హత్య నేరం కేసు నమోదు చేయాలి. – టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ తిప్పారపు సంపత్

మావోయిస్టు నేత హిడ్మా ది బుటకపు ఎన్ కౌంటరే.. – మోడీ, అమిత్ షా దేశంలో హింసాత్మక పాలన చేస్తున్నారు.. – పోలీసుల పై హత్య నేరం కేసు నమోదు చేయాలి. – టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ తిప్పారపు సంపత్
IMG-20251120-WA0038

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దేశంలో గత ఆరు నెలల నుండి ఆపరేషన్ కగారు పేరుతో బిజెపి ప్రభుత్వం మోదీ, అమీత్ షా లాంటి వ్యక్తులు అరాచక పాలన చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా విస్మరించి మావోయిస్టులను చంపడమే లక్ష్యంగా పెట్టుకొని పాలన కొనసాగిస్తున్నారనీ, ఇది ముమ్మాటికి తప్పేనని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు విలేకరుల సమావేశంలో టిపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జి తిప్పారపు సంపత్ ఆరోపించారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మావోయిస్టు నేత హిడ్మా ది బుటకపు ఎన్కౌంటరేననీ, ఎందుకంటే ఒక కేంద్ర కమిటీ సభ్యుడికి తనతో అడివిలో రక్షణగా ఉండవలసిన వారు 28 మంది మావోయిస్టులు విజయవాడ నగరంలో ఒక ఇంట్లో ఎలా దొరుకుతారు అని ప్రశ్నిస్తున్న హిడ్మాతో పాటు అందరు దొరికారు కానీ హిడ్మాను వారి భార్యను మరియు ఇంకో ముగ్గురిని మాత్రమే హింసించి చంపారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన కేంద్ర ప్రభుత్వమే చీకటి పాలన చేస్తుంటే ఎవరు కాపాడుతారని ఈ సందర్భంగా అడుగుతున్నానన్నారు. గత మూడు రోజుల కిందట మావోయిస్టు నేత హిడ్మాను ఎన్కౌంటర్ చేయడం చాలా దురదృష్టకరమని పీడిత ప్రజల కోసం గిరిజన, హరిజనుల కోసం వారికి కనీస కూడు, గుడ్డ,నీడ కావాలని గత 20 సంవత్సరాల నుండి పోరాటం చేస్తుంటే ఆ సమస్యను అమిత్ షా, మోడీ లాంటివారు పరిష్కరించకుండా ఆ సమస్యపై పోరాడుతున్న వారిని చంపుతామంటే ఇదేమి పాలన అని అన్నారు. బిజెపి రాక్షస పాలన నుండి ప్రజలు విముక్తి పొందాలంటే మరో ఉద్యమం దేశంలో వస్తే తప్ప ఈ దేశాన్ని కాపాడుకోలేమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు హిడ్మాను కావాలనే పట్టుకొని హింసించి చంపారన్నారు. ఇది బిజెపి ప్రభుత్వానికి పీడిత ప్రజల కోసం పనిచేసిన వారిని కాపాడవలసిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉందని, వారు ఒకవైపు లొంగిపోవడానికి వచ్చినా కూడా వారిని చంపడం బిజెపి కిరాతక పాలనకు నిదర్శనమని అన్నారు. ఇది దేశ ప్రజలు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో మోడీ, అమిత్ షా లాంటి నాయకులకు ప్రజలు బుద్ధి చెప్తారు అని అన్నారు. హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ గా కోర్టులో సుమోటాగా తీసుకొని ఆయా పోలీసు అధికారులపై కేసులు నమోదు చేయాలని మరియు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎన్కౌంటర్ చేస్తామని అమిత్ షా లాంటి వారు బహిరంగంగా ప్రకటించడంపై సుప్రీంకోర్టు, హైకోర్టులు సుమోటోగా తీసుకొని వీరిపై కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా తిప్పారపు సంపత్ డిమాండ్ చేశారు.

Oplus_16908288

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ తిప్పారపు సంపత్

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!