21-11-2025 NORMAL NEWS 05:58 PM
swarnodayam.com
Telugu Daily News
21-11-2025 05:58 PM By Mandala Yadagiri

హుజురాబాద్ అభివృద్ధికి సహకరించండి. – కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి.

హుజురాబాద్ అభివృద్ధికి సహకరించండి. – కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి.
IMG-20251121-WA0023

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలసి, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై సమగ్రంగా చర్చించారు.

హుజురాబాద్ నియోజకవర్గంలోని అయిదు మండలాల్లో అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పూర్తి చేయడానికి తగిన బడ్జెట్ వెంటనే కేటాయించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వివరించారు. ముఖ్యంగా ఇల్లందకుంట మండలంలో పుర్తిగా ధ్వసం ఐన రాచపల్లి నుండి బూజునూర్ గ్రామం వెళ్లే రోడ్డు మరియు నాగంపేట నుండి రాచపల్లి వెళ్లే రోడ్డు మరియు రాచపల్లి బ్రిడ్జ్ కూడా పూర్తి స్థాయిలో కుంగిపోయింది అని వెంటనే వీటికి నిధులు మంజూరు చెయ్యాలని కోరారు. ఇతర ప్రధాన రహదారులు, కాల్వల ప్రాజెక్ట్ నిర్మాణం, శాశ్వత మౌలిక వసతులు హుజురాబాద్ స్కూల్ గ్రౌండ్ వంటి పలు కీలక ప్రాజెక్టులు నిలిచిపోయాయని, వీటి గురించి గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా వివరంగా చెప్పినట్లు గుర్తుచేశారు.

హుజురాబాద్ సమగ్ర అభివృద్ధి కోసం కనీసం వెయ్యి కోట్ల నిధులను మంజూరు చేసి, అనుమతులు పొందిన పనులు సహా పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే అభ్యర్థనలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్వీకరించి, వెంటనే రాచపల్లి నుండి బూజునూర్ గ్రామం వెళ్లే రోడ్డు మరియు నాగంపేట నుండి రాచపల్లి వెళ్లే రోడ్డు మరియు రాచపల్లి బ్రిడ్జ్ కి నిధులు మంజూరు చేస్తాం అని మరియు హుజురాబాద్ అభివృద్ధికి అవసరమైన నిధులు, సహకారం అందిస్తాం అని హామీ ఇచ్చారు.

కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు విజ్ఞాపన పత్రం అందజేస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!