Social 1080×1350 • Multi-page
21-11-2025 BREAKING NEWS 06:44 PM
swarnodayam.com
Telugu Daily News

రాజకీయాధిపత్య పోరులో అధికారులు(బదిలీ) బలి… – అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నలిగిపోతున్న అధికారులు.. – రాజకీయ ఒత్తిడిలో తాసిల్దార్ బదిలీ అయినట్లు ప్రచారం!

రాజకీయాధిపత్య పోరులో అధికారులు(బదిలీ) బలి… – అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నలిగిపోతున్న అధికారులు.. – రాజకీయ ఒత్తిడిలో తాసిల్దార్ బదిలీ అయినట్లు ప్రచారం!
IMG_20251121_184113

–హుజురాబాద్‌కు జక్కని నరేందర్, కోడెం కనకయ్యకు గన్నేరువరం పోస్టింగ్..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకుల రాజకీయాధిపత్య పోరులో అధికారులు బలి (బదిలీ) అవుతున్నట్లు బాహాటంగా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆదిపత్య పోరు హుజురాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతుంది. దీంతో ప్రతిపక్ష నేతగా ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అధికార పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ప్రణవ్ బాబు ఇద్దరి మధ్య అధికారులు నలిగిపోతున్నట్లుగా పలువురు భావిస్తున్నారు. రాజకీయ ఒత్తిడిలోనే ప్రస్తుత తాసిల్దార్ బదిలీ అయినట్లు ప్రచారం జరుగుతుంది.
హుజురాబాద్ మండల నూతన తహసిల్దార్‌గా (ఎం.ఆర్.ఓ.) జక్కని నరేందర్ నియమితులయ్యారు. ఆయన కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలం తహసిల్దార్‌గా సమర్థంగా విధులు నిర్వహించి ఇక్కడికి బదిలీపై వచ్చారు.
నూతనంగా బదిలీపై వచ్చిన నరేందర్ హుజురాబాద్ తహసిల్దార్ కార్యాలయంలో తన బాధ్యతలను అధికారికంగా శుక్రవారం స్వీకరించారు. ఆయన నియామకం పట్ల మండల ప్రజలు, రెవెన్యూ శాఖ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
తాసిల్దార్ కనకయ్య బదిలీపై చర్చోప చర్చలు..
ఇంతకుముందు హుజురాబాద్ తహసిల్దార్‌గా పనిచేసిన కోడెం కనకయ్యను బదిలీ చేస్తూ, ఆయనకు గన్నేరువరం మండల తహసిల్దార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. అయితే, ఆయన బదిలీ సాధారణ పరిపాలన బదిలీ కాకుండా అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల కారణంగా జరిగిందనే ప్రచారం మండలంలో జోరుగా కొనసాగుతుంది. ఇటీవల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అధికార పార్టీ నేతలకు తెలియకుండా చేయడం ఒక కారణం కాగా అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడికి సంబంధించిన భూమి సంబంధించిన విషయంలో విభేదాలకు తాసిల్దార్ ససేమిరా అనడంతోనే ఈ బదిలీ జరిగినట్లుగా ప్రచారం జరుగుతుంది. హుజురాబాద్‌లో తహసిల్దార్ కోడెం కనకయ్య అనతి కాలంలోనే రంజాన్ వేడుకలను, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, విద్యార్థులకు ఆదాయ, కుల సర్టిఫికెట్ల అందజేసిన తీరు, తదితర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రశంసలు పొందారు. ఆయన అందించిన సేవలను మండల ప్రజలు, పార్టీలకతీతంగా నాయకులు, అధికారులు అభినందించారు. అలాంటి అధికారి నిబంధనల పూర్తి కాలం విధులు నిర్వహించకుండా అనతి కాలంలోనే ఆకస్మికంగా బదిలీ చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. హుజురాబాద్‌లో విధులు నిర్వర్తించిన కోడెం కనకయ్యకు ఇక్కడి నుంచి బదిలీ కావడంతో, ఆయన స్థానంలో వచ్చిన నరేందర్.. గన్నేరువరం మండల రెవెన్యూ అధికారిగా కనకయ్య బాధ్యతలు స్వీకరించనున్నారు.
నూతన తహసిల్దార్ జక్కని నరేందర్ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నలిగిపోకుండా, నీతి నిజాయితీగా, ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకొని ప్రజలకు మరింత చేరువగా ఉండి, రెవెన్యూ సంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

రాజకీయ ఒత్తిడిలోనే బదిలీ అయిన హుజరాబాద్ తాసిల్దార్ కనకయ్య..

హుజురాబాద్ తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన జక్కని నరేందర్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!