Social 1080×1350 • Multi-page
22-11-2025 BREAKING NEWS 06:14 PM
swarnodayam.com
Telugu Daily News

హనుమాన్ నామస్మరణతో మార్మోగిన తుమ్మనపల్లి..రెండవ రోజు కొనసాగిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన వేడుకలు.

హనుమాన్ నామస్మరణతో మార్మోగిన తుమ్మనపల్లి..రెండవ రోజు కొనసాగిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన వేడుకలు.
IMG-20251122-WA0065

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ నవంబర్ 22: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలోని శ్రీ శివ పంచాయతన పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో ధ్వజస్తంభ. శిఖర యంత్ర ప్రతిష్ట, శాంతి కళ్యాణం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు శనివారం హనుమాన్ నామంతో గ్రామం మార్మోగింది. ఆలయ ప్రధాన అర్చకుడు రాఘవాచార్య సమక్షంలో వేద పండితులు చెరుకుపల్లి నిఖిలాచార్య, సుజిత్ కుమార్ చార్యులు, సముద్రాల గోపాలకృష్ణ మాచార్యులు.. హర్షవర్ధనాచార్యులు వేద మంత్రోత్సవాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. రెండవ రోజు శనివారం గోపూజ, యాగశాల ప్రవేశం, ద్వార తోరన ధ్వజ కుంభ పూజ, అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్ర, మూర్తి మంత్ర హోమం, మన్యుహస్త హోమం, ధ్వజస్తంభ, శిఖరానికి పంచగవ్య తోపాటు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గాజుల కుమారస్వామి, మాజీ సర్పంచులు జీ ప్రతాపరెడ్డి, యాళ్ల శ్రీనివాసరెడ్డి, భాస్కర్, ఎంపిటిసిలు రాజేశ్వర్ రెడ్డి, రామ్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఏనుగు సత్యనారాయణ రెడ్డి, గ్రామస్తులు తిరుపతిరెడ్డి, చిరంజీవిరెడ్డి, వాసుదేవరెడ్డి, బాబురెడ్డి, స్వామిరెడ్డి, ఉమేష్ రెడ్డి, యతీశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288

తుమ్మనపల్లిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ధ్వజస్తంభ ప్రతిష్టాపన వేడుకల దృశ్యాలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!