Social 1080×1350 • Multi-page
23-11-2025 BREAKING NEWS 06:59 PM
swarnodayam.com
Telugu Daily News

మస్జిద్ ఈద్గా దర్గా కబ్రుస్తాన్ ఆశు ఖానా దీన్ని మదర్సలను వక్ఫ్ బోర్డులో నమోదు చేయండి. – హుజురాబాద్ జామే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు ముజాహిద్ హుస్సేన్ ముస్లింలకు విజ్ఞప్తి

మస్జిద్ ఈద్గా దర్గా కబ్రుస్తాన్ ఆశు ఖానా దీన్ని మదర్సలను వక్ఫ్ బోర్డులో నమోదు చేయండి. – హుజురాబాద్ జామే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు ముజాహిద్ హుస్సేన్ ముస్లింలకు విజ్ఞప్తి
IMG-20251123-WA0112

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో ఆదివారం రోజున జామి మజీద్ ఆవరణములో హుజురాబాద్ నియోజవర్గానికి చెందిన మజీద్ ఈద్గా కబ్రిస్తాన్ ఆశు ఖానా లాంటి సంస్థలకు చెందిన అధ్యక్షులతో ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హుజురాబాద్ జామే మస్జీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ మధ్యకాలం పార్లమెంట్లో waqt boardకు సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించారన్నారు. దీనిపై కొన్ని ముస్లిం సంస్థలకు చెందిన నాయకులు సుప్రీంకోర్టులో కేసు వేయడం వలన waqt board కు చెందిన కొన్ని ఆస్తులపై పార్లమెంట్లో ఆమోదం పరిచిన కొన్ని విషయాలను సుప్రీంకోర్టు కొన్ని అభ్యంతరాలు తెలపడంతో భారతదేశంలో ఉన్న అన్ని ముస్లిం సంస్థలకు చెందిన మస్జీద్ ఈద్గా కబ్రిస్తాన్ దీని మదర్స ఆశు ఖానా దర్గాలు ఇలాంటి అన్ని డిసెంబర్ 5వ తేదీ లోపు waqt boardలో నమోద చేయించుకోవడానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. కనుక ముస్లిం సంస్థలకు చెందిన ఆస్తులను వెంటనే మజీద్ కమిటీ అధ్యక్షులు కబ్రుస్తాన్ కమిటీ అధ్యక్షులు దర్గాలకు చెందిన కమిటీ అధ్యక్షులు ఈద్గాళ్లకు చెందిన కమిటీ అధ్యక్షులు అందరూ డిసెంబర్ 5వ తేదీ లోపు waqt board లో నమోద చేసుకోవాలని హుజురాబాద్ జమే మజీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సూచించారు. కనుక మజీద్ ఈద్గా కబ్రిస్తాన్ దీని మదర్స ఆశు ఖానా లాంటి సంస్థలకు చెందిన కమిటీ అధ్యక్షులు వెంటనే నమోదు చేసుకోవాలని మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఉచితంగా మజీద్ కొరకు స్థలం ఇచ్చిన అలాంటి కూడా మసీదులకు waqt board లో నమోద చేసుకుంటే చాలా బాగుంటుందని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మజ్జిద్ కమిటీ నాయకులు మహమ్మద్ హబీబ్, మహమ్మద్ రఫీ, మున్ను, మహమ్మద్ ఇర్ఫాన్ తాజుద్దీన్, మహమ్మద్ అజ్మతుల్లా ఖాన్, మహమ్మద్ ఫయాజ్, మహమ్మద్ అంజాద్, మొహమ్మద్ అబ్దుల్ జమీల్, హర్షత్, నాయక్ ఇమామ్ మొహమ్మద్ అబ్దుల్ ఫహీమ్, మజీద్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్, ఎస్ కే ఫయాజ్, సయ్యద్ అబ్దుల్లా, అజీమ్, మహమ్మద్ ఆబిద్, మహమ్మద్ చాంద్, మహమ్మద్, ముస్లిం నాయకులు మహమ్మద్ అక్బర్, మొహమ్మద్ సలీం, మహమ్మద్ భాషూమియా, మహమ్మద్ నవాబ్, అజ్మతుల్లా ఖాన్, ముజాహిద్ మహమ్మద్, అంకుష్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288

సమావేశంలో మాట్లాడుతున్న హుజురాబాద్ జామే మస్జీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!