Social 1080×1350 • Multi-page
24-11-2025 BREAKING NEWS 05:31 PM
swarnodayam.com
Telugu Daily News

విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది.. – కాంగ్రెస్ నేత ప్రణవ్..

విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది.. – కాంగ్రెస్ నేత ప్రణవ్..
1004378722

– కేసి క్యాంప్ లోని ఎంజెబిటి ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి నిధుల మంజూరు.

– త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయండి.

– వైద్య రంగానికి మరిన్ని నిధులు తీసుకొస్తా.. ప్రణవ్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో విద్య,వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని,రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిధులు మంజూరు చేసిందని రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి పూర్తి చేస్తామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. సోమవారం రోజున హుజురాబాద్ పట్టణ పరిధిలోని కేసీక్యాంపులో గల మహాత్మా జ్యోతిభా పూలే పాఠశాలలో 30 లక్షలతో అదనపు తరగతుల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగ విషయంలో సమస్యలు తన దృష్టికి రాగానే ఎస్డిఎఫ్ నిధుల నుండి కోటి రూపాయలు విడుదల చేశామని,విద్యార్తులకు కాస్మోటిక్స్ చార్జీలు పెంచమని, ప్రజా పాలనలో ఒక్కొక్కటిగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, స్కిల్ నైపుణ్యం కోసం ఐటీఐ(ఏటిసి) మంజూరు చేపించమని అన్నారు. అలాగే వైద్య పరంగా హుజురాబాద్, జమ్మికుంట హాస్పిటల్స్ కు చెరో 15లక్షలు, 30 లక్షల నిధులు మంజూరు చేపించామని, ఇంకా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కూడా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

భూమి పూజ చేస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్..

పట్టణ పరిధిలోని కేసీక్యాంపులో గల మహాత్మా జ్యోతిభా పూలే పాఠశాలలో 30 లక్షలతో అదనపు తరగతుల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!