Social 1080×1350 • Multi-page
24-11-2025 BREAKING NEWS 06:22 PM
swarnodayam.com
Telugu Daily News

ఇతర రాష్ట్రాలలో ఎస్ టి కేటగిరిలో లేని తెగలు రాష్ట్రంలోకి వచ్చి ఎస్ టి హోదా పొంది ఎస్టీ రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్న వారిని తొలగించి, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి నిజమైన ఆదివాసులకు న్యాయం చేయాలి.. – తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు

ఇతర రాష్ట్రాలలో ఎస్ టి కేటగిరిలో లేని తెగలు రాష్ట్రంలోకి వచ్చి ఎస్ టి హోదా పొంది ఎస్టీ రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్న వారిని తొలగించి, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి నిజమైన ఆదివాసులకు న్యాయం చేయాలి.. – తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు
IMG-20251124-WA0221

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎస్టీలు కానీ కులాలు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఎస్టి హోదా పొందుతున్న వాళ్ల వల్ల నిజమైన లంబాడీలకు మరియు
ఆదివాసి ఎరుకలతో పాటు ఇతర ఆదివాసి తెగలకు రాజ్యాంగ ఫలాలు అందక విద్యా ఉద్యోగ ఉపాధి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు గుర్తు చేశారు. నిన్న ఆదివారం రాత్రి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కూతాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం హుజూరాబాద్ లో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు హాజరై మాట్లాడుతూ…

తెలంగాణ రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన లంబాడీలకు రాజకీయ పార్టీలలో పార్టీ పదవులతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు నామినేటెడ్ పదవులు పొందుతున్నారన్నారు. కాబట్టే లంబాడీల మధ్య ఆదివాసుల మధ్య గొడవలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే చొరవ తీసుకొని 1976 తర్వాత వచ్చిన లంబాడీలను ఎస్టి హోదా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లంబాడీలు ఇతర రాష్ట్రాల నుంచి వలస రావడం వల్లనే.. ఇతర తెగలకు రాజ్యాంగ ఫలాలు అందక అభివృద్ధి చెందలేకపోతున్నారని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ క్రింది సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఎరుకల అభివృద్ధి కోసం ప్రత్యేక ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. గత ప్రభుత్వం 60 కోట్లతో కొత్తగా రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఎరుకల ఎంపవర్మెంట్ స్కీంని (YES ) G.O.No. 56 / 2023 యధావిధిగా అమలు చేయాలన్నారు.

గత ప్రభుత్వం హైదరాబాద్ నిజాంపేట్ లో ఏకలవ్య భవనం కోసం ఎకరం భూమి, మూడున్నర కోట్లతో నిర్మించిన ఏకలవ్య భవనం నిధులు లేక భవనం పూర్తి కాలేదు అని, అట్టి భవనం పూర్తిగా నిర్మాణం కావడానికి అదనంగా ఐదు కోట్లు బడ్జెట్ కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనేటి రాజు, కూతాడి శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు,
జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాడి శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవెల్లి రాజలింగం, జిల్లా ఉపాధ్యక్షులు కుతాడి కుమారస్వామి,
మానకొండూరు మండల అధ్యక్షులు బండి సమ్మయ్య, జమ్మికుంట మండల అధ్యక్షులు కూతాడి తిరుపతి, ఎరుకల యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ లోకిని పూర్ణచందర్, కేతిరి రాజశేఖర్, వరంగల్ జిల్లా అధ్యక్షులు హనుమకొండ జిల్లా అధ్యక్షులు లోకిని సమ్మయ్య, మానుపాటి రమేష్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడి కుమార్, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు దుగ్యాల బాపు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288

మాట్లాడుతున్న తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు

జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో నినాదాలు చేస్తున్న తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు, ఇతర నాయకులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!