Social 1080×1350 • Multi-page
24-11-2025 BREAKING NEWS 06:45 PM
swarnodayam.com
Telugu Daily News

హలో కళాకారులు… చలో కరీంనగర్ .. ఈనెల 28న కళాభారతిలో తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం ఆవిర్భావ రాష్ట్ర సదస్సు.. – సకల వృత్తి కళాకారులు విజయవంతం చేయండి

హలో కళాకారులు… చలో కరీంనగర్ .. ఈనెల 28న కళాభారతిలో తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం ఆవిర్భావ రాష్ట్ర సదస్సు.. – సకల వృత్తి కళాకారులు విజయవంతం చేయండి
IMG-20251124-WA0108(1)

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గవర్నర్ చే రాష్ట్ర స్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తాళ్లపల్లి సంధ్య చేతుల మీదుగా కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈరోజు హుజురాబాద్ పట్టణంలోనీ అంబేద్కర్ కూడలి వద్ద ప్రముఖ సంఘ సేవకులు రాష్ట్ర గవర్నర్ చే రాష్ట్రస్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర ఆవిర్భావ రాష్ట్ర సదస్సు పోస్టర్ను వారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. వారితో తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తాళ్ల పెళ్లిసంధ్య, ఈనెల 28 కరీంనగర్ లోని కళాభారతిలో జరిగే తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం ఆవిర్భావ రాష్ట్ర సదస్సుకు సకల వృత్తి కళాకారులు అధిక సంఖ్యలో రావాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తాళ్ల పెళ్లి సంధ్య విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారులు ఎంతోమంది ఉన్నారని వారికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని వృద్ధ కళాకారులకు పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో బోనాల పండుగకు బతుకమ్మ వేడుకలకు కళాకారులకు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ద్వారా అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 28న కరీంనగర్ లోని కళాభారతిలో రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేస్తున్నామని అధిక సంఖ్యలో జానపద సకల వృత్తి కళాకారులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆమె వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జానపద సకలవృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దాట్ల నిర్మల బాలల హక్కుల ప్రజా వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి బైరి చంద్రశేఖర్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు తునికి వసంత్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రుద్రారపు రామచంద్రం, సీనియర్ కళాకారులు అందేసి నారాయణ, హుజురాబాద్ డివిజన్ తెలంగాణ జానపద సకలవృత్తి కళాకారుల సంఘం దాట్ల మోహన్, కవిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పట్టణంలోనీ అంబేద్కర్ కూడలి వద్ద ప్రముఖ సంఘ సేవకులు రాష్ట్ర గవర్నర్ చే రాష్ట్రస్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్, తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర ఆవిర్భావ రాష్ట్ర సదస్సు పోస్టర్ను వారి చేతుల మీదుగా ఆవిష్కరీస్తున్న దృశ్యం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!