26-11-2025 NORMAL NEWS 05:30 PM
swarnodayam.com
Telugu Daily News
26-11-2025 05:30 PM By Mandala Yadagiri

ఘనంగా న్యాయ దినోత్సవ ర్యాలీ.. – రాజ్యాంగ విలువల్ని కాపాడుకుందాం.. – సబ్ జడ్జీ పి.బి.కిరణ్ కుమార్

ఘనంగా న్యాయ దినోత్సవ ర్యాలీ.. – రాజ్యాంగ విలువల్ని కాపాడుకుందాం.. – సబ్ జడ్జీ పి.బి.కిరణ్ కుమార్
IMG-20251126-WA0039

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని హుజురాబాద్ కోర్టులో సబ్ జడ్జీ పి.బి.కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. న్యాయమూర్తులు, న్యాయవాదుల పెద్ద ఎత్తున కోర్ట్ నుండి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా సబ్ జడ్జీ పి బి కిరణ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలయ్యేలా చూడటం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. అదే విధంగా హక్కులతో పాటు పౌరులందరూ బాధ్యతలను కూడా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జీ పద్మ సాయిశ్రీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వై అరుణ్ కుమార్, ఏజీపీ గుర్రం శ్రీనివాస్ గౌడ్, న్యాయవాదులు ముక్కెర రాజు, నల్ల భూంరెడ్డి, కేతిరి శ్రీనివాస్ రెడ్డి, బండి రవీందర్, కొత్తూరు రమేష్, మట్టెల తిరుపతి, శివరామకృష్ణ, భాగోతం కుమారస్వామి, ఎం. విక్రమ్, సిహెచ్ భానుకిరణ్, శ్రీరాం, శిరీష, కోర్టు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాదుల ర్యాలీ

ర్యాలీలో పాల్గొన్న న్యాయమూర్తులు పి.బి. కిరణ్ కుమార్, పద్మ సాయి శ్రీ, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!