Social 1080×1350 • Multi-page
27-11-2025 BREAKING NEWS 07:15 PM
swarnodayam.com
Telugu Daily News

ఫైల్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ కనీస అవగాహన పెంచుకోవాలి.. – కూరపాటి ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ కూరపాటి రమేష్

ఫైల్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ కనీస అవగాహన పెంచుకోవాలి.. – కూరపాటి ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ కూరపాటి రమేష్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ప్రజలు ఫైల్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ కనీస అవగాహన పెంచుకోవాలని కూరపాటి ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ కూరపాటి రమేష్ అన్నారు. గురువారం ప్రపంచ ఫైల్స్ దినోత్సవం పురస్కరించుకొని హుజూరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో వాకర్స్ కు ఫైల్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. ఫైల్స్ వ్యాధి పట్ల అవగాహన కోసం ర్యాలీ నిర్వహించి అనంతరం పోస్టల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆహారపు అలవాట్ల మూలంగా మలబద్ధకం ఏర్పడుతుందని, అనంతరం ఫైల్స్ ఏర్పడతాయని అన్నారు. ఫైల్స్ వ్యాధి వచ్చినవారు నిర్భయంగా నిస్సక్కోచంగా డాక్టర్లను సంప్రదించాలని, సిగ్గు, బిడియంతో తమ బాధను చెప్పుకోకపోవడం వల్ల అవి పెరిగి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని అన్నారు. అందువల్ల ఫైల్స్ వ్యాధి ఉన్న ఎవరైనా వైద్యుని సలహా మేరకు మందులు వాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ నాయకులు డాక్టర్ రామలింగారెడ్డి, క్యాస ఉపేందర్, ఆడెపు సూర్యం, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరిప్రసాద్, సభ్యులు వేల్పుల రత్నం, ఈశ్వర్ రెడ్డి, మార్త రవి, చిలుకమారి శ్రీనివాస్, సతీష్, సారయ్య, రవీందర్ బాబు, కే ప్రభాకర్, సమ్మయ్య, దేవిక తదితరులు పాల్గొన్నారు.

వాకర్స్ కు పైల్స్ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్న డాక్టర్ కూరపాటి రమేష్…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!