Social 1080×1350 • Multi-page
27-11-2025 BREAKING NEWS 10:28 PM
swarnodayam.com
Telugu Daily News

ఆగయ్యకు శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు

ఆగయ్యకు శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు
IMG-20251127-WA0085

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఇటీవలే మృతి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ఎన్టీఆర్ వీరాభిమాని కీ.శే.కల్యాడపు ఆగయ్య దశ దిన కర్మను గురువారం కరీంనగర్ పట్టణ మధువణి గార్డెన్ లో వారి కుటుంబ సభ్యులు నిర్వహించిన కార్యక్రమంలో నాయకులతో కలిసి రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పాల్గొని మృతుని చిత్ర పటానికి ఘనంగా నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టీడీపీలో ఆగయ్యతో కలిసి పనిచేసిన గత స్మృతులను రామారావు గుర్తు చేసుకున్నారు. మంచి ఆత్మీయ మిత్రుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ లో మున్నూరు కాపు సంఘ ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించారని, టీడీపీలో ఎందరో నాయకులకు కార్యకర్తలకు స్ఫూర్తి దాయకం అని పోలాడి రామారావు కొనియాడారు.
కార్యక్రమంలో కరీంనగర్ మాజీ ఎంపీపీ వాసాల రమేష్, మాజీ కౌన్సిలర్లు కోడూరి రవీందర్ గౌడ్, ఆకుల రమేష్, వీరగోని శ్రీనివాస్, నాయకులు బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఆడేపు కమలాకర్, మోరే ప్రభాకర్, ఎర్రవెల్లి రవీందర్, ఎర్రవెల్లి వినీత్, హయగ్రీవాచారి తదితరులతో పాటు ఆగయ్య అభిమానులు టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించారు.

Oplus_16908288

నివాళులర్పిస్తున్న పోలాడి రామారావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!