Social 1080×1350 • Multi-page
28-11-2025 BREAKING NEWS 08:20 PM
swarnodayam.com
Telugu Daily News

బేడ బుడగ జంగం జన సంఘం నూతన కమిటీల ఏకగ్రీవ ఎన్నిక.. – నియామక పత్రాలు అందజేసిన రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు

బేడ బుడగ జంగం జన సంఘం నూతన కమిటీల ఏకగ్రీవ ఎన్నిక.. – నియామక పత్రాలు అందజేసిన రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు
IMG-20251128-WA0101

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
బేడ బుడగ జంగం జన సంఘం హుజురాబాద్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో డివిజన్, మండల స్థాయి పదవులను ప్రకటించి వారికి నియామక పత్రాలు అందజేశారు. డివిజన్ గౌరవ అధ్యక్షులుగా తూర్పాటి రామస్వామి, డివిజన్ అధ్యక్షుడిగా తూర్పాటి సాంబయ్య, మండల అధ్యక్షుడిగా కడమంచి స్వామి, ప్రధాన కార్యదర్శిగా భూతం అంజి,మండల ఉపాధ్యక్షుడిగా మోతే సుమన్, కోశాధికారిగా తురుపాటి రామచంద్రం, జాయింట్ సెక్రటరీగా చెన్నూరి తిరుపతి, ఆర్గనైజర్‌గా గంధం మధు ఎన్నికయ్యారు. పురుష విభాగంలో గంధం నరసయ్య, పర్వతం రాంబాబు, మోటం వెంకటేష్, మోటం కనకతార, భూతం తిరుపతి, గంధం రవి కార్యవర్గ సభ్యులుగా ఎంపికయ్యారు.మహిళా అధ్యక్షురాలిగా వానరాశి సమ్మక్క, ఉపాధ్యక్షురాలిగా బోడ పూర్తి రాజమ్మ, ప్రధాన కార్యదర్శిగా తూర్పాటి రజిత కార్యవర్గ సభ్యులుగా తూర్పాటి లక్ష్మి, బోడ పూర్తి సమ్మక్క, సిరిపాటి స్వరూప ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ…పట్టణంలోని 23వ వార్డులో బేడ బుడగ జంగాల కాలనీలో సీసీ రోడ్లు, డ్రెయినేజీ, వీధి దీపాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కమ్యూనిటీ హాలు, అలాగే ఆచార ప్రకారం బొందలు పెట్టుకునే స్మశానవాటిక ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నూతనంగా ఎన్నికైన వారికి అభినందనలు తెలిపారు.

నూతనంగా ఎన్నికైన హుజురాబాద్ డివిజన్, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు..

అభివాదం చేస్తున్న నూతనంగా ఎన్నికైన నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!