28-11-2025 NORMAL NEWS 08:50 PM
swarnodayam.com
Telugu Daily News
28-11-2025 08:50 PM By Mandala Yadagiri

బ్యాంకులు అందించే రుణాలతో వీధి వ్యాపారులు లబ్ధి పొందాలి. – మెప్మా పిడి స్వరూపరాణి

బ్యాంకులు అందించే రుణాలతో వీధి వ్యాపారులు లబ్ధి పొందాలి. – మెప్మా పిడి స్వరూపరాణి
IMG-20251128-WA0113

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
పట్టణాల్లో గ్రామాల్లో చిన్నచిన్న వ్యాపారం చేసుకునే వీధి వ్యాపారస్తులు బ్యాంకుల అందించే రుణాలతో లబ్ధి పొందాలని డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ స్వరూప రాణి అన్నారు. శుక్రవారం హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్పీలతో ప్రత్యేక సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….మెప్మాలో ఉన్న ఆర్పిలు ప్రతి సంఘానికి రుణాలు ఇప్పించాలని, రుణాలు తీసుకున్న వీధి వ్యాపారస్తులు రుణాల వల్ల ప్రయోజనం పొందుతున్నారా పరిశీలించాలన్నారు. పాత సంఘాలతో పాటు కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలని, వీధి విక్రయదారులకు పిఎమ్ఎస్ వి ఏ నిధి ద్వారా రుణాలు పెంచి వాటిని వారు ఎప్పటికప్పుడు చెల్లించే విధంగా పర్య వేక్షించాలన్నారు. హుజురాబాద్ ప్రాంతంలో ఎక్కువమంది వీధి వ్యాపారస్తులు లబ్ధి పొందేలా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమములో మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య, డిఎంసి శ్రీవాణి, శ్రీనిధి మేనేజర్ అనిల్, టియంసి మల్లీశ్వరి, సిఎల్ఆర్ పిలు రమదేవి, స్వరూప, టిఎల్ఎఫ్ ఆర్పి అరుణ, ఓబీలు, ఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు.

వీధి వ్యాపారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న పిడి స్వరూపరాణి..

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ సందర్శించి వివరాలను తెలుసుకుంటున్న పిడి స్వరూపరాణి

ఆర్పీలతో ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతున్న పీడి స్వరూపారాణి పక్కన కమిషనర్ సమ్మయ్య, తదితరులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!