Social 1080×1350 • Multi-page
29-11-2025 BREAKING NEWS 04:10 PM
swarnodayam.com
Telugu Daily News

ఆల్ ఇండియా పోలీస్ మీట్ కు ఎంపికైన వినీత్

ఆల్ ఇండియా పోలీస్ మీట్ కు ఎంపికైన వినీత్
IMG-20251129-WA0043

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
గుజరాత్ లోని రాజ్ కోట్ లో త్వరలో జరగనున్న అల్ ఇండియా హాకీ పోలీస్ మీట్ లో హుజురాబాద్ పట్టణానికి చెందిన హాకీ క్రీడాకారుడు మోటపోతుల వినీత్ ఎంపికయ్యాడు. డిసెంబర్ 4వ తేదీ నుండి 15 వ తేదీ వరకు గుజరాత్ రాజకోట్ లో జరుగనున్న అల్ ఇండియా హాకీ పోలీస్ మీట్ లో స్పెషల్ అర్మడ్ రిజర్వు (SARCPL) హైదరాబాద్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మోటపోతుల వినీత్ పోలీస్ టీం తరఫున గా హాకి ఆడనున్నాడు. వినీత్ ఎంపిక కావడం పట్ల హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షులు తోట రాజేంద్రప్రసాద్, హాకీ క్లబ్ జిల్లా ఉపాధ్యక్షులు బండ శ్రీనివాస్, క్లబ్ హుజురాబాద్ మాజీ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, కార్యదర్శి బొడిగె తిరుపతి, ఉపాధ్యక్షుడు భూసాల శంకర్, క్రీడాకారులు సాదుల శ్యామ్, సజ్జు, సాయి కృష్ణ, విక్రమ్, రాజేష్, సాంబరాజు వంశీ, వినయ్, పరబ్రహ్మం తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

అల్ ఇండియా హాకీ పోలీస్ మీట్ కు ఎంపికైన మోటపోతుల వినీత్..

మోటపోతుల వినీత్

గుజరాత్ లోని రాజ్ కోట్ లో త్వరలో జరగనున్న అల్ ఇండియా హాకీ పోలీస్ మీట్ లో హుజురాబాద్ కు పట్టణానికి చెందిన హాకీ క్రీడాకారుడు మోటపోతుల వినీత్ ఎంపికైన దృశ్యం..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!