Social 1080×1350 • Multi-page
29-11-2025 BREAKING NEWS 07:13 PM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ ముద్ర అమోఘం.. – ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ ముద్ర అమోఘం.. – ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: దశాబ్దాల కాల స్వరాష్ట్ర తెలంగాణ సాధన ఉద్యమ సారథిగా కేసీఆర్ యావత్ తెలంగాణ సమాజంలో చెరగని ముద్ర వేసారని కేసీఆర్ లేని నూతన తెలంగాణ రాష్ట్రాన్ని ఊహించుకోలేమని ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు.
తెలంగాణ కోసం కెసిఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష నవంబర్ 29వ తేదీకి గుర్తుగా శనివారం కరీంనగర్లో ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం, అమరుల త్యాగాలు, గత స్మృతులను నెమరువేసుకుంటూ నిర్వహించిన కార్యక్రమంలో పోలాడి రామారావు పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం 2019,నవంబర్ 29వ తేదీన కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితం సకల జనులు ఏకమైన వేల అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని పోలాడి వివరించారు. నవంబర్ 29, 2019 చరిత్రను మలుపు తిప్పిన రోజని అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29 లేకపోతే, డిసెంబర్ 9 లేదని, డిసెంబర్ 9 లేకుంటే, జూన్ 2 లేదన్నారు. ఆనాటి ఉద్యమ స్మృతులను, ఉద్యమ కారులను, అమరుల త్యాగాలను గుర్తు చేసుకునే రోజే తెలంగాణా కోసం కేసీఆర్ చేపట్టిన దీక్షరోజైన నవంబర్ 29వ తేదీ అని అన్నారు.
తెలంగాణ వచ్చింది కాబట్టే దేశానికి అన్నం పెట్టే దాన్యాగరంగా తెలంగాణ మారిందన్నారు. అభివృద్ధిలో తలసరి ఆదాయం లో దూసుకు పోతోందని రామారావు అన్నారు. తెలంగాణ కోసం గత అరవై ఏళ్ళ లో చివరి అస్త్రం,తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అని నినదిస్తూ కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షతో ఢిల్లీ పీఠాలను కదిలించి తెలంగాణ నేలకు విముక్తి కలిగించిందని ఇందుకు కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర సాదకుడిగా రాజకీయాల కతీతంగా యావత్ తెలంగాణ సమాజం కలకాలం గుర్తుంచుకుంటుందని ఇది కాదనలేని సత్యం అని పోలాడి రామారావు అన్నారు.

కరీంనగర్లో ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం, అమరుల త్యాగాలు, గత స్మృతులను నెమరువేసుకుంటూ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న పోలాడి రామారావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!