Social 1080×1350 • Multi-page
29-11-2025 BREAKING NEWS 08:13 PM
swarnodayam.com
Telugu Daily News

కౌశిక్ రెడ్డి పేరు వింటేనే వణికిపోతున్న కాంగ్రెస్ శ్రేణులు.. – తాటాకు చప్పులకు భయపడం భౌతిక దాడులు చేస్తే ప్రతిదాడులు చేస్తాం!- బిఆర్ఎస్ యువజన నాయకులు మోరే మధు

కౌశిక్ రెడ్డి పేరు వింటేనే వణికిపోతున్న కాంగ్రెస్ శ్రేణులు.. – తాటాకు చప్పులకు భయపడం భౌతిక దాడులు చేస్తే ప్రతిదాడులు చేస్తాం!- బిఆర్ఎస్ యువజన నాయకులు మోరే మధు
IMG-20251129-WA0059

వార్డు మెంబర్ కూడా గెలవని వ్యక్తి ఏ ప్రోటోకాల్ ఉంది అని అధికారిక కార్యక్రమంలో పాల్గొంటడు..

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రోటోకాల్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని భారత రాష్ట్ర సమితి యువజన నాయకులు మోరే మధు పేర్కొన్నారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్నాం అధికారంలో ఉన్నాం అని భౌతిక దాడులు చేస్తాం అని విర్ర వీగితే భారత రాష్ట్ర సమితి నాయకులు చూస్తూ ఊరుకోరని, దాడులకు ప్రతి దాడులు చేస్తాం అని హెచ్చరించారు. వార్డ్ మెంబర్ గా కూడా గెలవని వ్యక్తి నియోజకవర్గ అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి మరిచిన హామీలను ఎండగడుతూ ప్రభుత్వం మీద పదునైన మాటలతో దాడి చేస్తున్న కౌశిక్ అన్నను ప్రజలు ఆదరిస్తున్నారని, అసూయతో కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకో లేక పోతున్నారు అని మండిపడ్డారు. సాధ్యం కానీ హామీలు ఇచ్చి వాటిని ప్రశ్నిస్తే దాడులు చేస్తాం అని, ప్రశ్నిస్తే దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తాం అని అసహనానికి గురయ్యే కాంగ్రెస్ శ్రేణులు ఆత్మ విమర్శ చేసుకొని బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. రాజకీయాలలో హుందా గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనుక్కొని కోర్టు చేతిలో చివాట్లు తిన్న విషయం మరచిపోవద్దు అని గుర్తు చేశారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బిఆర్ఎస్ యువజన నాయకుడు మోరే మధు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!