Social 1080×1350 • Multi-page
30-11-2025 BREAKING NEWS 04:10 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రజావాణి కార్యక్రమం రద్దు.. – కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజావాణి కార్యక్రమం రద్దు.. – కలెక్టర్ పమేలా సత్పతి
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:


కరీంనగర్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుండి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

ప్రజావాణి కార్యక్రమం రద్దయిన విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగిసేంతవరకు ప్రజావాణి కార్యక్రమము ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తామని వెల్లడించారు.

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!