Social 1080×1350 • Multi-page
30-11-2025 BREAKING NEWS 08:28 PM
swarnodayam.com
Telugu Daily News

డిసెంబర్ 3న జర్నలిస్టుల సమస్యలపై మహా ధర్నా.. -టీయుడబ్ల్యూజె (ఐజెయు) ఆద్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ

డిసెంబర్ 3న జర్నలిస్టుల సమస్యలపై మహా ధర్నా.. -టీయుడబ్ల్యూజె (ఐజెయు) ఆద్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ : జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయుడబ్ల్యూజే (ఐజెయు) ఆద్వర్యంలో హైదరాబాద్ లో డిసెంబర్ 3న మహా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీయుడబ్ల్యూజె (ఐజేయూ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్ తెలిపారు. ఆదివారం హనుమకొండ బాల సముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజేే హనుమకొండ జిల్లా కమిటీ ఆద్వర్యంలో డిసెంబర్ 3న హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన మహా ధర్నా కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు తక్షణమే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని, ఆరోగ్య భీమా పథకాన్ని పునరుద్ధరించాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, వృత్తి కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని జర్నలిస్టులు పెద్దపెట్టున నినాదాలు చేశారు.అనంతరం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం తాత్సార దోరణి అవలంబిస్తూ కాలయాపన చేస్తున్నదని అన్నారు. జర్నలిస్టుల సమస్యలపై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యం వహిస్తున్నదని, ఈ క్రమంలో ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు వడిసెంబర్ 3న హైదారాబాద్ మాసాబ్ ట్యాంక్ రాష్ర్టసమాచార కమీషనర్ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటలకు మహా ధర్నా నిర్వహించ తలపెట్టినట్లు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమానికి జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల నాయకులు, యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజె (ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపెల్లి మధు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంకనాల సంతోష్, జాతీయ కౌన్సిల్ సభ్యులు పీవీ మదన్ మోహన్, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు గడ్డం కేశవమూర్తి, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, సహాయ కార్యదర్శి డాక్టర్ పొడిశెట్టి విష్ణు వర్ధన్, సీనియర్ నాయకులు సిహెచ్ సోమనర్సయ్య, ఎం. రాజేంద్రప్రసాద్, అనుముల రవి, దేవేందర్, ఎండి ఉస్మాన్ పాషా తదితరులు పాల్గొన్నారు.

చలో హైదరాబాద్ మహా ధర్నా పోస్టర్లను ఆవిష్కరిస్తున్న జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!