Social 1080×1350 • Multi-page
01-12-2025 BREAKING NEWS 05:39 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ అయ్యప్పస్వామి దేవాలయంలో నిత్య అన్నదానం ప్రారంభం.. జనవరి 10 వరకు నిరాటకంగా అన్న వితరణ.

హుజురాబాద్ అయ్యప్పస్వామి దేవాలయంలో నిత్య అన్నదానం ప్రారంభం.. జనవరి 10 వరకు నిరాటకంగా అన్న వితరణ.
IMG-20251201-WA0096

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని శ్రీ సంతోషిమాత, నవగ్రహ సహిత అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం ఒకటవ తేదీ నుండి వచ్చేనెల జనవరి 10వ తారీఖు వరకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. అయ్యప్ప దేవాలయ నిర్వహణ కమిటీ నాయకులు దాతలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని శాస్త్రయుక్తంగా ప్రారంభించారు. మొదటి రోజు సుమారు 250 మంది అయ్యప్ప స్వాములు, భక్తులు భిక్ష ఆరగించారు. దాతలు అయ్యప్ప స్వాములకు బిక్ష పెట్టేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరిస్తే విజయవంతంగా కార్యక్రమాన్ని ప్రతి ఏడు కొనసాగించడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు కొత్త అశోక్ రెడ్డి తెలిపారు. ఈ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని అయ్యప్ప స్వాములు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని, దాతలు తోచిన సహాయం వస్తువు రూపేణ గాని ఆర్థికంగా గానీ చేసి అయ్యప్ప స్వామి కృపాకటాక్షనికి పాత్రులు కావాలని కోరారు.

అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఆలయ నిర్వాహకులు, దాతలు..

అన్నదాన కార్యక్రమంలో బిక్ష చేస్తున్న అయ్యప్ప స్వాములు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!