Social 1080×1350 • Multi-page
01-12-2025 BREAKING NEWS 08:58 PM
swarnodayam.com
Telugu Daily News

కోతుల నడుమ గ్రామ సర్పంచ్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ బలపరిచిన అభ్యర్థి ఎర్రోళ్ల రమేష్

కోతుల నడుమ గ్రామ సర్పంచ్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ బలపరిచిన అభ్యర్థి ఎర్రోళ్ల రమేష్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి(ఎల్కతుర్తి): హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం కోతుల నడుమ గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, న్యాయవాది ఎర్రోళ్ల రమేష్ కాంగ్రెస్ పార్టీ నుండి నామినేషన్ దాఖలు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో భారీ సంఖ్యలో ర్యాలీగా తరలిపోయి రిటర్నింగ్ అధికారి గోపాల్ పూర్ దగ్గర దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఎర్రోళ్ల రమేష్ మాట్లాడుతూ ఊరి సంక్షేమ కోసం నిరంతరము కృషి చేస్తానని, అందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధి పతంలోకి తీసుకు వస్తానని అన్నారు. గతంలో అందరూ హామీలు ఇచ్చి గాలికి వదిలేయడం జరిగిందని, కానీ తాను మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి అంకితభావంతో ప్రజాసేవ చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఎన్నికలకు ముందే రమేష్ కు అన్ని వర్గాల నుండి మద్దతు తెలుపుతూ ఉండడం కోస మేరుపు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల జగన్, పల్లబోయిన రాజుయాదవ్, యూత్ కాంగ్రెస్ హుస్నాబాద్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల చైతన్య మరియు గ్రామ శాఖ అధ్యక్షులు శ్రావణ్, శ్రీపతి మొగిలి, రాజేష్, విజయ్, మాట్ల రాజయ్య, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కోతుల నడుమ గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, న్యాయవాది ఎర్రోళ్ల రమేష్ కాంగ్రెస్ పార్టీ నుండి నామినేషన్ దాఖలు చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!