Social 1080×1350 • Multi-page
02-12-2025 BREAKING NEWS 07:18 PM
swarnodayam.com
Telugu Daily News

జనరల్ సీట్లలో బీసీలను గెలిపించుదాం. -ప్రజాస్వామిక బిసి ఉద్యమ వేదిక పిలుపు

జనరల్ సీట్లలో బీసీలను గెలిపించుదాం. -ప్రజాస్వామిక బిసి ఉద్యమ వేదిక పిలుపు
IMG-20251202-WA0063

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ప్రభుత్వం బీసీలను మోసం చేసిన నేపథ్యంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలను గెలిపించి బీసీల బలాన్ని చాటాలని ప్రజాస్వామిక బీసీ ఉద్యమ వేదిక నాయకులు అన్నారు. మంగళవారం హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో బిసి డిఎఫ్ నాయకులు పర్యటించారు. గ్రామంలో బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులతో మాట్లాడి వారిని చైతన్య పరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బీసీలలో సామాజిక చైతన్యం తీసుకురావడం ద్వారా ఐక్యత పెరుగుతుందన్నారు.బీసీలను రిజర్వేషన్ల పేరిట ప్రభుత్వం దగా చేసిందని అందుకే
మన ఓటు మనకే అనే నినాదంతో జనరల్ సీట్లలో బీసీలను గెలిపిద్దాం అన్నారు. జనరల్ సీట్లలో బీసీలు పోటీ చేయాలని ధైర్యం చెప్పడానికి సమాజంలో గౌరవంగా జీవించడానికి
బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత వర్ధిల్లాలని అన్నారు. కానీ అగ్రవర్ణాల మీద పోటీ చేయడానికి ఎస్సీ ఎస్టీ బీసీలు ధైర్యం చాలడం లేదు ముందుకు రావడం లేదు ఇంకా అంధకారంలోనే ఉన్నారనీ అన్నారు.
ప్రజాస్వామ్య దేశంలో పోటీ చేసే హక్కు ప్రతి ఒక్క కులానికి ఉంటుందని ప్రతి ఒక్కరు ముందుకొచ్చి జనరల్ సీట్లో బీసీలు నిలబడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య బీసీ ఉద్యమ వేదిక మండల కన్వీనర్ సాదుల రవీందర్, భీమోజు సదానందం, గోస్కుల ముత్యంరాజు, కొలిపాక సారయ్య, వేల్పుల రత్నం, ఆళ్ల కేశవులు,
పుల్లూరి బిక్షపతి, పులి జగన్నాథం, పెట్టం కుమారస్వామి,
వేల్పుల ప్రభాకర్, కే రాజేందర్, తాళ్లపల్లి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288

సిరసపల్లి విలేజిలో ప్రజలకు చైతన్య పరుస్తున్న ప్రజాస్వామ్యబిసి ఉద్యమ వేదిక నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!