Social 1080×1350 • Multi-page
03-12-2025 BREAKING NEWS 06:14 PM
swarnodayam.com
Telugu Daily News

కొత్తపల్లి నాగేంద్రస్వామి దేవాలయం వద్ద మార్మోగిన అయ్యప్ప శరణు ఘోష.. – రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మహా దివ్య పడిపూజ.

కొత్తపల్లి నాగేంద్రస్వామి దేవాలయం వద్ద మార్మోగిన అయ్యప్ప శరణు ఘోష.. – రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మహా దివ్య పడిపూజ.
IMG-20251203-WA0050

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్‌, డిసెంబర్ 3: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని కొత్తపల్లి శ్రీ నాగేంద్రస్వామి దేవాలయ ప్రాంగణంలో మంగళవారం రాత్రి మహా దివ్య పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పోరెడ్డి రవీందర్ రెడ్డి 18వ పడి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మోతే తిరుపతి గురుస్వామి, ఎస్ రమేష్, కే వెంకట్రావు, కన్నన్ దురై రాజ్ గురు స్వాముల ఆధ్వర్యంలో పేద పండితులు పందిళ్ళ భాస్కర్ శర్మ, కృష్ణ శర్మల మంత్రోచ్ఛారణల మధ్య సాగిన ఈ పడి పూజ వేడుకల్లో హుజురాబాద్ పట్టణం, వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి అయ్యప్ప మాల ధరించిన సుమారు 300 మంది స్వాములు, 200 మంది నానుస్వాములు పాల్గొన్నారు. సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించగా ఆవరణమంతా అయ్యప్ప స్వామి శరణు ఘోషతో మారు మ్రోగింది. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు జమ్మికుంటకు చెందిన గురుస్వామి జయేందర్ స్వామి ఆధ్వర్యంలో జమ్మికుంట చుట్టుపక్కల గ్రామాలకు చెందిన అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారిని ఆరాధించారు. ప్రముఖ గాయకులు వడ్లకొండ అనిల్ కుమార్, హుజురాబాద్ శివరామకృష్ణ, కొత్తపల్లి రామానంద భజన మండలిల ఆధ్వర్యంలో భజన–కీర్తనలు నిర్వహించగా ఆ ప్రాంతమంతా భక్తి వాతావరణం నెలకొంది. 18వ పడి పూర్తిచేసిన గురుస్వాములకు రవీందర్ రెడ్డి గురుస్వామి శాలువాలతో ఘనంగా సత్కరించారు. రవీందర్ రెడ్డి పడి అంటించగా ఒక్కసారిగా స్వాములు లేచి స్వామియే శరణమయ్యప్ప అంటూ కొలిచారు. అనంతరం తీర్థప్రసాదాలు, అల్పాహారం అందజేషారు. ఈ కార్యక్రమం హుజురాబాద్ పట్టణంలోనీ కొత్తపల్లి గ్రామంలో మొట్ట మొదటిసారిగా ఇంత పెద్ద దివ్య మహా పడిపూజ నిర్వహించగా భక్తి పరవశ్యంలో గ్రామస్తులు మునిగిపోయారు.

అయ్యప్ప ఆభరణాలు తెస్తున్న రవీందర్ రెడ్డి గురుస్వామి..

18వ పడి సందర్భంగా కొబ్బరి మొక్క, పోను కర్రను నెత్తిన, చేతిలో పట్టుకొని వస్తున్న రవీందర్ రెడ్డి గురుస్వామి..

భక్తి గీతాలు ఆలపిస్తున్న కళాకారులు, భజన మండలి సభ్యులు..

Oplus_16908288

పేటతుళ్ళు చేస్తున్న అయ్యప్ప స్వాములు..

పదునెట్టంబడి అంటిస్తున్న పోరెడ్డి రవీందర్ రెడ్డి గురుస్వామి, మోతే తిరుపతి గురుస్వామీలు..

Oplus_16908288
Oplus_16908288

నైవేద్యం తీసుకు వస్తున్న రవీందర్ రెడ్డి గురుస్వామి..

18వ పడి పూర్తిచేసిన సందర్భంగా రవీందర్ రెడ్డి గురుస్వామికి గండబేరండం తొడుగుతున్న కుటీర స్వాములు..

జమ్మికుంట జయేందర్ గురుస్వామి ఆధ్వర్యంలో హాజరైన అయ్యప్ప స్వాములు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!