Social 1080×1350 • Multi-page
06-12-2025 BREAKING NEWS 06:43 PM
swarnodayam.com
Telugu Daily News

పలు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

పలు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
IMG-20251206-WA0096

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు శనివారం హుజూరాబాద్ పట్టణంలో ఉద్యోగులు, ప్రజాసంఘాల, ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో వేర్వేరుగా ఘనంగా జరిగాయి. అంబేద్కర్ చౌరస్తా వద్ద, అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ, బస్టాండ్ లో డిఎం రవీంద్రనాథ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేసి భారతదేశాన్ని సర్వ సత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా తీర్చిదిద్దుటకు భారత రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజలకు అందించారన్నారు. ప్రజలకు సమాన హక్కులు అందించి సమసమాజ స్థాపనకు దేశ అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ఆయన రాసిన రాజ్యాంగ ఫలాలను మనం అనుభవిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ చైర్మన్ మారెపల్లి శ్రీనివాస్, కార్యదర్శి కలవల మల్లయ్య, టీజేఎస్ రాష్ట్ర నాయకులు ముక్కెర రాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, వివిధ సంఘాల నాయకులు తునికి సమ్మయ్య, సొల్లు బాబు, ఆర్ కే రమేష్, పంజాల శ్రీధర్, యండి ఇమ్రాన్, నీరటి రమేష్, డాక్టర్ తడికమళ్ళ శేఖర్, రుద్రారపు కుమార్, సిరిపాటి వేణు, రవీందర్, ఇల్లందుల సమ్మయ్య, వెల్పుల రత్నం, వేల్పుల ప్రభాకర్, సందమల్ల బాబు, కొలిపాక మహేష్, గడిపే రాజు, అంబాల రవీందర్, సొల్లు సునీత, గడిపే రాజు, ఎల్ఐసి కుమార్, ముత్యం రాజు, ఏబీవీపీ నాయకులు కొయ్యడ అంజి, పెరుగు అభిలాష్, అభి, బన్నీ, శ్రీకాంత్, శివాజీ, బేడ బుడగ జంగం_ జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కరు వర్ధంతి సందర్భంగా చౌరస్తాలోని ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ డివిజన్ అధ్యక్షులు తూర్పాటి సాంబయ్య, హుజురాబాద్ మండల అధ్యక్షులు కడమంచి స్వామి, హుజురాబాద్ మండల ప్రధాన కార్యదర్శి భూతం అంజి, మండల ఉపాధ్యక్షులు మోతే సుమన్, కార్యవర్గ సభ్యులు చెన్నూరు తిరుపతి, మోటం సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288

అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో…

Oplus_16908288

ఏబీవీపీ ఆధ్వర్యంలో…

బేడ బుడగ జంగం_ జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!