06-12-2025 NORMAL NEWS 10:04 PM
swarnodayam.com
Telugu Daily News
06-12-2025 10:04 PM By Mandala Yadagiri

అంబేద్కర్ కు ప్రజా సంఘాల నేతలు కొవ్వొత్తులతో నివాళి

అంబేద్కర్ కు ప్రజా సంఘాల నేతలు కొవ్వొత్తులతో నివాళి
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా శనివారం రాత్రి హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజాసంఘాల నాయకులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ దేశానికి, బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు వేల్పుల రత్నం, డాక్టర్ టి శేఖర్, తునికి సమ్మయ్య, మేకల రవీందర్, గడిపే రాజు, పసుల స్వామి, కెఆర్ బిక్షపతి, ఈ చంద్రశేఖర్, డీ ప్రభాకర్, పీ సహదేవ్, వంశీ, రామ్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

కొవ్వొత్తులతో అంబేద్కర్ కు నివాళులర్పిస్తున్న ప్రజా సంఘాల నాయకులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!