Social 1080×1350 • Multi-page
08-12-2025 BREAKING NEWS 07:31 PM
swarnodayam.com
Telugu Daily News

క్రిస్మస్ సంతోషం.. అనాథ పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపిన వేడుకలు

క్రిస్మస్ సంతోషం.. అనాథ పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపిన వేడుకలు
IMG-20251208-WA0081

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్(వీణవంక): క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఆదివారం రోజున గన్ముక్ల మరియు బేతిగల్ గ్రామంలోని యవ్వనస్థులు (CSI church) జమ్మికుంటలోని స్పందన అనాథ ఆశ్రమంలో ప్రత్యేక వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పిల్లలు క్రిస్మస్ ప్రేమ సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని, నిరాశ్రయులైన పిల్లల ముఖాల్లో ఆనందాన్ని చూడటం జరిగింది. అనంతరం ఆశ్రమంలో ఉన్న సుమారు 20 మంది పిల్లలకు & సిబ్బందికి ప్రత్యేకమైన భోజనం, బహుమతుల పంపిణి, కేక్ కటింగ్, బైబిల్, కూరగాయలు నిత్యావసర సరుకులు అందిస్తూ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సేవ కార్యక్రమం అనంతరం రైల్వే స్టేషన్, రోడ్డు పక్కన ఉన్నటువంటి నిరుపేదలకు దుప్పట్లు, ఆహారం పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో క్రిస్టమస్ వర్తమానాన్ని కొత్తపల్లి దీక్షిత్ అందించారు. ప్రత్యూష, క్రిస్టిన, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

స్పందన అనాధాశ్రమంలో కేక్ కట్ చేస్తున్న గన్ముక్ల మరియు బేతిగల్ గ్రామంలోని యవ్వనస్థులు..

రోడ్డు పక్కన నిద్రించే వారికి బ్లాంకెట్లు, చెద్దర్లు పంపిణీ చేస్తున్న క్రైస్తవులు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!