11-12-2025 NORMAL NEWS 09:57 PM
swarnodayam.com
Telugu Daily News
11-12-2025 09:57 PM By Mandala Yadagiri

వెల్ది గ్రామపంచాయతికి స్వచ్ఛందంగా రూ.30 లక్షలు విరాళం ప్రకటిస్తూ హామీ పత్రం అందించిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోరుకంటి మధుసూదన్ రావు.

వెల్ది గ్రామపంచాయతికి స్వచ్ఛందంగా రూ.30 లక్షలు విరాళం ప్రకటిస్తూ హామీ పత్రం అందించిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోరుకంటి మధుసూదన్ రావు.
IMG-20251211-WA0055

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల పరిధిలోని వెళ్ది గ్రామ సర్పంచ్ అభ్యర్థి పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి కొరుకంటి మధు సూదన్ రావు తనను గెలిపిస్తే స్వంతంగా రూ.30 లక్షలు విరాళం ప్రకటిస్తూ హామీ పత్రం ప్రకటించారు. ఇట్టి నిధులతో గ్రామ అభివృద్ది పనులను దగ్గరుండి పూర్తి చేస్తానని అవసరమయితే మరిన్ని నిధులు కలిపి ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తాననీ అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తూ నిజాయితీ పరిపాలన అందిస్తానని తెలిపారు. తాను ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచకుండా యువత, మహిళల ఆధ్వర్యంలో కొత్త ఒరవడికి నాంది పలుకుతామని, నన్ను గ్రామ ప్రజలు ఆశీర్వదించి నా గుర్తు బ్యాట్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మధుసూదన్ రావు కోరారు. మధుసూదన్ రావు నిర్ణయం పట్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభినందనలు వెలువడుతున్నాయి.

వెల్ది గ్రామపంచాయతికి స్వచ్ఛందంగా రూ.30 లక్షలు విరాళం ప్రకటిస్తూ హామీ పత్రం రాసిచ్చిన మధుసూదన్ రావు..

తనను గెలిపిస్తే చేసే అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రం…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!