Social 1080×1350 • Multi-page
12-12-2025 BREAKING NEWS 05:55 PM
swarnodayam.com
Telugu Daily News

చెల్పూర్ మూడవ వార్డు అభ్యర్థిగా తిరుపతి విస్తృత ప్రచారం.. – అందరి మద్దతుతో గెలుపు దిశగా ముందుకు సాగుతూ…

చెల్పూర్ మూడవ వార్డు అభ్యర్థిగా తిరుపతి విస్తృత ప్రచారం.. – అందరి మద్దతుతో గెలుపు దిశగా ముందుకు సాగుతూ…
IMG-20251212-WA0063

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామం మూడో వార్డులో బీసీ ఆజాద్ ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు, మూడో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తూ పంజాల తిరుపతి శుక్రవారం ఇంటింటికి తిరిగి విస్తృతంగా ప్రచారము నిర్వహించారు. ఊరికి, ఆ వార్డుకు ఆవసరాల గురించి, వార్డ్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటు.. ముందుకు సాగారు. గత పాలకులు పట్టించుకోని సమస్యలన్నిటిని గుర్తించి తను గెలిచిన తర్వత ఆ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. వాడ ప్రజలకు నేనున్నానంటూ ఓటర్ మహాశయులకు విన్నవించుకుంటూ.. వారిని ఓట్లు వేయమని వేడుకున్నాడు. తన ప్రచారంకు ఓటర్ల నుండి చక్కని స్పందన లభించిందని తన గెలుపుపై తలకు ధీమా కలిగిందని ఈ సందర్భంగా తిరుపతి స్పష్టం చేశారు. తన ప్రత్యర్థులు ఎన్ని రకాలుగా ఆశ చూపెట్టిన తన ప్రజలు ప్రలోభాలకు లొంగరని, ఓటుతో వారికి తగిన గుణపాఠం చెప్పి తనను వార్డు సభ్యుడిగా ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. నేడు నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పలువురు గ్రామ మహిళలు, పురుషు ఓటర్లు స్వచ్ఛందంగా పాల్గొన్న వారిలో సుంకరి మాధవిరెడ్డి, పంజాల ఓదెలుగౌడ్, పంజాల సిద్ధార్థగౌడ్, సదానందంగౌడ్, మురారి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288

తన గుర్తు స్టూలు చూపెడుతూ ఓట్లను అభ్యర్థిస్తున్న తిరుపతి…

Oplus_16908288
Oplus_16908288

కరపత్రాలు పంచుతూ తన గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్న తిరుపతి…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!