13-12-2025 NORMAL NEWS 08:10 PM
swarnodayam.com
Telugu Daily News
13-12-2025 08:10 PM By Mandala Yadagiri

“వంగర గ్రామ సర్పంచ్ పాలక మండలికి ఘన సత్కారం”

“వంగర గ్రామ సర్పంచ్ పాలక మండలికి ఘన సత్కారం”
IMG_20251213_200726

స్వర్ణోదయం ప్రతినిధి, హనుమకొండ (వంగర) భీమదేవరపల్లి
డిసెంబరు13:
ఇటీవల గ్రామపంచాయతి ఎన్నికల్లో భీమదేవరపల్లి మండలం వంగర గ్రామ సర్పంచ్ గా ఎన్నికై గజ్జెల స్రుజన రమేశ్, ఉప సర్పంచ్ ఒల్లాల రమేశ్, వార్డు సభ్యులను పి.వి‌.కుటుంబ సభ్యుల పక్షాబ భీమదేవరపల్లి మండల మాజీ ఉపాధ్యక్షుడు, పి.వి.నరసింహారావు సోదరుని కుమారడు పి.వి.మదన్ మోహన్ ఘనంగా సత్కరించారు.
వంగర గ్రామంలోని‌ పి.వి.మ్యూజియంలో ఈ సత్కార కార్యక్రమం జరిగింది. అంతకు ముందు సర్పంచ్ స్రుజన, ఉప సర్పంచ్ రమేశ్ పి.వి.విగ్రహానీకి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఇతర పాలక మండలి సభ్యులు పుష్పాంజలి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పి.వి.మదన్ మోహన్ మాట్లాడుతూ వంగర గ్రామం‌ అన్ని రంగాలలో ముందంజ వుండేందుకు తమ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ బడుగు వర్గాల అభ్యున్నతికి ఎంతో క్రుషి చేసారని గుర్తు చేశారు.

దేశ ప్రధానిగా పి.వి.పంచాయతి రాజ్ చట్ట సవరణ ద్వారా స్థానిక సంస్థల్లో‌ మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత పి.వి.దే నని ప్రస్తుతించా వంగర గ్రామం ప్రపంచ పుటల్లో సుస్థిర స్థానాన్ని పొందిందని గ్రామ ప్రతిష్ఠ ఇనుమడింప చేసే విధంగా నూతన‌ పాలక‌ మండలి‌ కృషి చేయాలని కోరారు. నూతన పాలకమండలికి‌ పి.వి.సోదరుడు మనోహర్ రావు, పి.వి.గ్లోబల్ ఫౌండేషన్ చేర్మన్ పి.వి.ప్రభాకర్ రావు, MLC వాణీదేవి శుభాకాంక్షలు అందచేసారని ఆయన తెలిపారు.
నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గజ్జెల స్రుజన మాట్లాడుతూ “భారతరత్న ” మాజీ ప్రధాని స్వర్గీయ పి.వి‌నరసింహారావ స్వంత గ్రామం వంగరకు సర్పంచిగా ఎన్నికకావడం‌ పట్ల గర్వంగా వుందని‌ తెలిపారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా ‌అన్ని వర్గాల సహాయ సహకారాలతో పార్టీలకతీతంగా ముందుకు సాగనున్నట్లు వివరించారు. మాజీ సర్పంచ్ ఆర్.వెంకటరెడ్డి మాట్లాడుతూ వంగర గ్రామాభివృద్ధికి మాజీ ప్రధాని‌ పి.వి.చేసిన సేవలు గొప్పవి దానిని కుటుంబ సభ్యులు అమలు చేస్తున్నారని వివరించారు.
ఇప్పటికి పి.వి‌.పేరు వాడుకొని‌ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పి.వి.మ్యూజియం భాద్యులు లక్ష్మీకాంతారావు,
నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యలు శ్రీరామోజు మొండయ్య, మారం సతీష్, గజ్జెల రమేశ్, బత్తిన బిక్షపతి,కాల్వ సంపత్, కాంగ్రెస్ నాయకులు సుహాసిని, సతీష్ రెడ్డి, నల్లగోని‌ సురేశ్, వెంకటస్వామి, సియచ్.తిరుపతి రెడ్డి చంద్రారెడ్డి,
బుచ్చిరెడ్డి, గజ్జెల సంజీవ్, ఆవుల రాజయ్య, కాల్వ మల్లయ్య, బొగ్గు రాజయ్య తదితరులు పాల్గొన్నారు‌.

వంగర గ్రామ సర్పంచ్ గా ఎన్నికై గజ్జెల స్రుజన రమేశ్ లను ప్రత్యేకంగా అభినందిస్తున్న పి.వి‌.కుటుంబ సభ్యుల పక్షాబ భీమదేవరపల్లి మండల మాజీ ఉపాధ్యక్షుడు, పి.వి నరసింహారావు సోదరుని కుమారడు పి.వి.మదన్ మోహన్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!