Social 1080×1350 • Multi-page
14-12-2025 BREAKING NEWS 07:01 PM
swarnodayam.com
Telugu Daily News

GSKDI విద్యార్థులకు శాలువాలతో ఘన సన్మానం.. – రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో హుజురాబాద్ విద్యార్థుల ప్రతిభ.

GSKDI విద్యార్థులకు శాలువాలతో ఘన సన్మానం.. – రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో హుజురాబాద్ విద్యార్థుల ప్రతిభ.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గ్లోబల్ శోటోకాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందుతున్న హుజురాబాద్ పట్టణం కరాటే విద్యార్థులు జగిత్యాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొని వివిధ కేటగిరీలలో 9 గోల్డ్ మెడల్స్ మరియు2 సిల్వర్ మెడల్స్ సాధించారు. ఆ విద్యార్థులను హుజురాబాద్ పట్టణంలోనీ స్థానిక న్యూ కాకతీయ మోడల్ స్కూల్ లోని ప్రజాసంఘాల నాయకుల యేల్పులు రత్నం మాట్లాడుతూ కరాటేను ఇప్పుడున్న సమాజంలో అమ్మాయిలకి అవసరం ఉందని అని చెప్పారు. నాయకుల ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో సన్మానించి సర్టిఫికెట్స్ అందజేసారు. కరాటే మాస్టర్ జలీల్ కృషిని కొనియాడుతూ కరాటే పోటీలలో గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులను అభినందించి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. కరాటే పిల్లల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక పరిపక్వతను పెంపొందించి వారిలో సామాజిక స్పృహతో పాటు జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణతో కూడిన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతుందన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడంతో పాటు వారు ధైర్యంగా ముందడుగు వేయగలుగుతారని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రిటైర్ పిటి సారయ్య, మహాత్మా అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షులు ఎండి ఖలీద్ హుస్సేన్, మహాత్మ జ్యోతిరావు పూలే మాజీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ పటేల్, కొలిపాక సమ్మయ్య, రిటైర్ ఎంఈఓ జమదగ్ని, లక్ష్మణామూర్తి, మేకల మల్లేష్, గోస్కుల మధు, గోస్కుల నాగమణి, ఎండి నవాబ్ మైనార్టీ నాయకులు ఎండి సలీం తదితరులు పాల్గొన్నారు.

మెడల్స్ సాధించిన విద్యార్థులతో అతిధులు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!