Social 1080×1350 • Multi-page
15-12-2025 BREAKING NEWS 06:20 PM
swarnodayam.com
Telugu Daily News

అలరించిన రిటైర్డ్ ఉద్యోగులకు ఆటల పోటీలు..

అలరించిన రిటైర్డ్ ఉద్యోగులకు ఆటల పోటీలు..
IMG-20251215-WA0144

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
పెన్షనర్స్ డే ను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో రిటైర్డ్ ఉద్యోగులకు క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీలలో వాకింగ్ షాట్ పుట్ క్యారం మొదలైన నిమిషాలలో పోటీలు నిర్వహించారు. సంఘ సభ్యులు సుమారు వందమంది క్రీడలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడల్లో విజేతలకు త్వరలోనే బహుమతులు అందజేయడం జరుగుతుందని సంఘ అధ్యక్షులు ఉస్మాని పాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి గంజి జవర్ధన్, కోశాధికారి దుర్గాజి, సభ్యులు జయ రామిరెడ్డి, వి లక్ష్మయ్య, మాడిశెట్టి నరసయ్య, ఫిజికల్ డైరెక్టర్లు కొన్ని రాజిరెడ్డి, వెంకటరెడ్డి, ఇలాసాగరం వీరస్వామి, లక్ష్మీనారాయణ, సదానందం, తదితరులు పాల్గొన్నారు.

రిటైర్డ్ ఉద్యోగుల క్రీడల్లో పాల్గొన్న ఔత్సాహిక రిటైర్డ్ ఉద్యోగులు..
Oplus_16908288
క్రీడా పోటీలలో భాగంగా వాకింగ్ పోటీలో పాల్గొన్న రిటైర్ ఉద్యోగుల సంఘం సభ్యులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!