Social 1080×1350 • Multi-page
17-12-2025 BREAKING NEWS 05:46 AM
swarnodayam.com
Telugu Daily News

బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరికి బాధ్యత

బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరికి బాధ్యత
IMG-20251216-WA0047

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ 16: సమాజంలోని బాల బాలికలకు18 సంవత్సరాల వయస్సు నిండని బాల్య వివాహాలు నిర్మూలన అందరి బాధ్యత అని జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ మాడుగుల రమేష్ అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని ఏరియా స్థాయి సమాఖ్య (మహిళా సంఘం), జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలికల)మహిళ, పిల్లల, వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖలోని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాల బాలికలకు బాల్ వివాహ ముక్త్ భారత్ 100 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో బాల్యవివాహాలు చేయడం అనేది బాలల భవిష్యత్తును నాశనం చేస్తుందనీ చదువుకునే బాలికలకు తెలిసి తెలియని వయసులో వివాహాలు చేయడం వల్ల శారీరక మానసిక ఇబ్బందులు ఎదురవుతాయి అన్నారు. దీనివల్ల వారు ఎంచుకున్న గమ్యాన్ని చేరుకోలేక అనేక అవకాశాలు వివాహల చేయడం వల్ల కోల్పోతారన్నారు. ఎక్కడైనా ఎవరైనా బాల్య వివాహాలు జరిపే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ -1098కు మరియు చైల్డ్ హెల్ప్ డెస్క్-9490881098 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వాల్ల వివరాలు గోప్యంగా ఉంచబడతాయనీ, బాల్య వివాహాలు జరిపించినా వారికి మరియు ప్రోత్సహించినా వారికి చట్ట ప్రకారం రెండు సంవత్సరాలు జైలు శిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా లేదా రెండు విధించబడతాయి, జరిమానా విధించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సివో స్వరూప, ఇంచార్జి హెడ్మాస్టర్ ఆసియా, ఉపాధ్యాయయలు కే సదానందం, శ్రీనివాస్, శారద, అనూష, శోభారాణి, రాజులతో పాటు మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Oplus_16908288

హుజురాబాద్ పట్టణంలోని మహిళా సంఘాలకు బాల్య వివాహముక్తు భారత్ పై అవగాహన సదస్సు

పాఠశాలలో విద్యార్థులకు బాల్ వివాహ ముక్త్ భారత్ పై అవగాహన సదస్సు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!