Social 1080×1350 • Multi-page
17-12-2025 BREAKING NEWS 10:37 PM
swarnodayam.com
Telugu Daily News

ఓడిన అభ్యర్థికి రూ.మూడు లక్షలు వచ్చాయి… నోటుకు, మద్యానికి దూరంగా… స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకున్న రంగాపూర్ గ్రామస్తులు.. – ఓటర్ల తీరుపై వెలువెత్తుతున్న అభినందనలు..

ఓడిన అభ్యర్థికి రూ.మూడు లక్షలు వచ్చాయి… నోటుకు, మద్యానికి దూరంగా… స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకున్న రంగాపూర్ గ్రామస్తులు.. – ఓటర్ల తీరుపై వెలువెత్తుతున్న అభినందనలు..
IMG-20251217-WA0071

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓడిన ఓ సర్పంచ్ అభ్యర్థికి రూ.మూడు లక్షలు వచ్చాయి… అదేలా అనుకుంటున్నారా..!? అయితే ఇది మొత్తం చదవండి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపురం గ్రామంలో ఓటర్లు నోటుకు, మద్యానికి దూరంగా ఉండి స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే గ్రామ పెద్దలు ఎన్నికలకు ఒక రోజు ముందు సమావేశమై వినూత్నంగా ఎన్నికల జరగాలని నిర్ణయించుకున్నారు. సర్పంచి వరిలో నిలిచిన ఇద్దరు వ్యక్తులు తల 20 లక్షల రూపాయల చొప్పున డిపాజిట్లు చేసి గ్రామ పెద్దల సమక్షంలో ఉంచారు. ఎవరైనా గ్రామస్తులకు మద్యం పంపిణీ చేసిన ఓటుకు నోటు పంపిణీ చేసిన వారి 20 లక్షల రూపాయలు జప్తి చేయడం జరుగుతుందని దానికి ఇద్దరు అభ్యర్థుల తోటి ఒప్పించారు. దానిని బాండ్ పేపర్ పై రాసి ఇరువురు అభ్యర్థుల సంతకాలను సైతం తీసుకున్నారు. ఈరోజు జరిగిన ఎన్నికల్లో గ్రామస్తులు స్వచ్ఛందంగా వివిధ ప్రాంతాల నుండి తరలిరావడమే కాక వృద్ధులు, మహిళలు, యువతులు, యువకులు ప్రలోభాలకు లొంగకుండా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎవరైతే ఓడిన అభ్యర్థి ఉంటాడో అతనికి గెలిచిన అభ్యర్థి డిపాజిట్ లోకేళ్లి 3 లక్షల రూపాయలు స్వచ్ఛందంగా ఇచ్చేలా ముందే ఒప్పందం ప్రకారం గెలిచిన అభ్యర్థి ఓడిన ఆ అభ్యర్థికి మూడు లక్షలు తిరిగి చెల్లించడం జరిగింది. చాలా చోట్ల ఏకగ్రీవం కోసం డిపాజిట్లు చేయడం, ఓటుకు నోటు చెల్లించడం, మద్యం పంచడం చూసాము.. కానీ ఈ రంగాపూర్ గ్రామంలో మాత్రం డిపాజిట్ చేసిన గెలిచిన అభ్యర్థి డబ్బులను రూ.20లక్షలను కూడా గ్రామ అభివృద్ధికి వినియోగించేలా మంచి నిర్ణయం తీసుకోవడం, ఏలాంటి ప్రలోభాలకు పోకుండా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్న రంగాపూర్ గ్రామ ప్రజలను జిల్లా ప్రజలే గాక రాష్ట్రంలోనే ప్రత్యేకంగా అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గెలుపొందిన కుంట అరుణ- తిరుపతిరెడ్డి..

వినూత్న ప్రచారంతో గెలుపొందిన కుంట అరుణ- తిరుపతిరెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!