Social 1080×1350 • Multi-page
18-12-2025 BREAKING NEWS 06:57 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రభుత్వాసుపత్రి సేవలను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలి – డీసీహెచ్ఎస్ డా. కృష్ణప్రసాద్

ప్రభుత్వాసుపత్రి సేవలను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలి – డీసీహెచ్ఎస్ డా. కృష్ణప్రసాద్
IMG-20251218-WA0039

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, డిసెంబర్ 18 : ప్రభుత్వాసుపత్రి సేవలను ప్రతిఒక్కరూ వినియోగించు కోవాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ సూచించారు. హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిని సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన సందర్శించారు. వార్డులను పరిశీలించి, అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు. వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. జూపాక పల్లె దవాఖాన వైద్యురాలు డాక్టర్ గీతకు ఏరియా ఆసుపత్రిలో ప్రసవం కాగా, ఆమెతో పాటు ఏరియా ఆసుపత్రి సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ సిబ్బంది, ప్రభుత్వాసుపత్రి సేవలను వినియోగించుకోవడం ద్వారా ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించవచ్చన్నారు. తద్వారా, పేదవారికి వైద్య సేవలు మరింత ఎక్కువగా అందించవచ్చన్నారు. ఆయన వెంట ఏరియా ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ నారాయణరెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ ప్రసాద్ రావు, సిబ్బంది ఉన్నారు.

జూపాక పల్లె దవాఖాన వైద్యురాలు డాక్టర్ గీతకు ఏరియా ఆసుపత్రిలో ప్రసవం కాగా, ఆమెతో పాటు ఏరియా ఆసుపత్రి సిబ్బందిని అభినందిస్తున్న డీసీహెచ్ఎస్ డా. కృష్ణప్రసాద్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!