Social 1080×1350 • Multi-page
19-12-2025 BREAKING NEWS 09:28 PM
swarnodayam.com
Telugu Daily News

రాబోయే ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.. – బిసి జేఏసీ డిమాండ్

రాబోయే ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.. – బిసి జేఏసీ డిమాండ్
IMG_20251219_212433


మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
రాబోయే జెడ్పిటిసి, ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పించాలని హుజురాబాద్ బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు హుజురాబాద్ లో సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింప చేసుకొని 9వ షెడ్యూల్ లో పొందుపరచి బీసీ బిల్లును అమలు చేసిన తర్వాతనే ఎంపీటీసీ జెడ్పిటిసి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. బీసీలు తమ జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థలలో చట్టసభలలో రిజర్వేషన్లు పొందవలసిన అవసరాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని డిమాండ్ చేశారు. బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ అమలు చేసే వరకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామనీ హెచ్చరించారు. ఈ సమావేశంలో హుజురాబాద్ బీసీ జేఏసీ గౌరవాధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందెల వెంకన్న, నాయకులు ఆలేటి రవీందర్, సబ్బని రాజేందర్, చిలుకమారి శ్రీనివాస్, ఆకుల సదానందం, ఉప్పు శ్రీనివాస్ పటేల్, ఇప్పకాయల సాగర్, దాసరి మల్లేశం, పరాంకుశం సనత్ కుమార్, మామునూరి ప్రవీణ్, కొండపర్తి సాయి, ఏ సదానందం, గరవేణ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288

సమావేశంలో మాట్లాడుతున్న హుజురాబాద్ బీసీ జేఏసీ గౌరవాధ్యక్షులు చందుపట్ల జనార్ధన్

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!