Social 1080×1350 • Multi-page
20-12-2025 BREAKING NEWS 06:25 PM
swarnodayam.com
Telugu Daily News

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శించిన రీజినల్ జాయింట్ డైరెక్టర్.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శించిన రీజినల్ జాయింట్ డైరెక్టర్.
IMG_20251220_182146

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): జమ్మికుంట మండలములోని కోరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె. సత్యనారాయణరెడ్డి సందర్శించారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రత పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. పాఠశాల గోడలపై వేసిన జాతీయ నాయకుల బొమ్మలను ఆసక్తిగా గమనించి చిత్రాలు వేసిన ఆర్ట్ టీచర్ శ్రీమన్నారాయణను అభినందించారు. .8వ తరగతి ఫిజిక్స్, పదవ తరగతి మ్యాథ్స్ పాఠ్య బోధనను పరిశీలించారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో మాటాడుతూ రోజా పాఠశాలకు రావాలని, ఉపాధ్యాయులు బోధించే అంశాలను శ్రద్ధతో వినాలని, అందరూ బాగా చదువుకొని పదవ తరగులో మంచి మార్కులతో పాస్ కావడమే కాక జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలిని సూచించారు.
అనంతరం పాఠశాలలో జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్ కు హాజరయారు. తల్లిదండులతో మాట్లాడుతూ పిల్లలకు సమతుల ఆహారాన్ని ఇవ్వాలని ఫైబర్, కార్పోహైడేట్స్, ఫ్యాట్స్ ఆహారంలో తగిన పాళ్లలో ఉండే విధంగా చూడాలని, ఆరోగ్యంగా ‘పిల్లలు ఉంటేనే మంచిగా చదువుతారని అన్నారు. అలాగే విద్యార్థులకు ఇంట్లో చదువుకునే వాతావరణాన్ని కల్పించాలని, ప్రతి నిత్యం పిల్లలను పరిశీలించాలని, వీరికి తగిన పోత్సాహం ఇవ్వాలని, పేరెంట్ టీచర్ మీటింగ్ కు తప్పని సరిగా హజరవాలని అన్నారు. ఈ సమావేశంలో సుమారు 40 మంది తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేతిరి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Oplus_16908288
పాఠశాలను సందర్శించిన విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె. సత్యనారాయణరెడ్డి
Oplus_16908288
పదవ తరగతి విద్యార్థుల, ఉపాధ్యాయులతో వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె సత్యనారాయణరెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!