20-12-2025 NORMAL NEWS 10:36 PM
swarnodayam.com
Telugu Daily News
20-12-2025 10:36 PM By Mandala Yadagiri

ప్రజారోగ్యంపై ప్రభావం చూపే డంపింగ్ యార్డ్ ఏర్పాటును విరమించుకోవాలి. – ఆర్డీవోకు ప్రజా సంఘాల వినతి

ప్రజారోగ్యంపై ప్రభావం చూపే డంపింగ్ యార్డ్ ఏర్పాటును విరమించుకోవాలి. – ఆర్డీవోకు ప్రజా సంఘాల వినతి
IMG-20251220-WA0148

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రాంత ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదనలను ప్రభుత్వం విరమించుకోవాలని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. శనివారం హుజురాబాద్ కెసి క్యాంపులోని హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ బాబుకు ప్రజా సంఘాల నాయకులు డంపింగ్ యార్డు ప్రతిపాదనను రద్దు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… వరంగల్ జిల్లా మడికొండలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ను ప్రజల వ్యతిరేకతతో అక్కడి నుండి తీసివేసి హుజురాబాద్ శివారులోని గణేష్ నగర్ లో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. ఇక్కడ ఏర్పాటుచేసే డంపింగ్ యార్డ్ లో
అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలోనీ పాలు పట్టణాల మున్సిపాలిటీల చెత్తను తీసుకుని వచ్చి రీ సర్కులేషన్ పేరుతో కరెంటును ఉత్పత్తి చేస్తారని అన్నారు. మడికొండలో ఏర్పాటు చేయాలనుకున్న డంపింగ్ యార్డ్ ను అక్కడి ప్రజల ఆగ్రహంతో హుజురాబాద్ కు తరలించడం హుజురాబాద్ లో ఉన్న ప్రజలు ఆరోగ్యంగా ఉండనవసరం లేద ఆని వారన్నారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు. డంపింగ్ యార్డ్ ద్వారా 10 గ్రామాల ప్రజలు రైతులు మానసికంగా అనారోగ్యంగా అంగవైకల్యంగా శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, అన్ని రకాల వ్యాధులు చర్మ శ్వాస కోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. వ్యవసాయానికి జంతువులకు పక్షులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని పర్యావరణం దెబ్బతింటుందని వారు తెలిపారు. ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్న డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ముందుకు వస్తే ఈ ప్రాంత ప్రజల ఆగ్రాహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు వేల్పుల ప్రభాకర్. ఎండి ఖాలిద్ హుస్సేన్, మార్త రవీందర్, సాదుల రవీందర్, కొత్తూరు రమేష్, బీమోజు సదానందం, గోస్కుల ముత్యంరాజు, బొంగోని రాజమౌళి, ఆర్ నరసయ్య, ఎన్ రవికుమార్, ఉప్పు శ్రీనివాస్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288

ఆర్డీవో రమేష్ బాబుకు వినతి పత్రం అందజేస్తున్న ప్రజా సంఘాల నాయకులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!