21-12-2025 NORMAL NEWS 03:11 PM
swarnodayam.com
Telugu Daily News
21-12-2025 03:11 PM By Mandala Yadagiri

రేపటి(సోమవారం)ప్రజావాణి రద్దు

రేపటి(సోమవారం)ప్రజావాణి రద్దు
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, డిసెంబర్ – 21:


కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో రేపు(సోమవారం) ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. రెండో సాధారణ పంచాయతీ ఎన్నికలు- 2025 లో గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులు ఈ నెల 22వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నందున అధికార యంత్రాంగం ఆయా పనులలో నిమగ్నమై ఉంటారని పేర్కొన్నారు. ఈ కారణంగా ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ నెల 29వ తేదీ నుండి యధాతధంగా ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!